
మర్రి నరేష్ జనవరి 24 2026 నాటి ప్రధాన వార్తా విశేషాలు
దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు హైదరాబాద్‌లో ఏటా ఫాలో-అప్ సమావేశాన్ని నిర్వహించేలా చర్చలు జరిపినట్లు సమాచారం
జనవరి నెలంతా రాష్ట్రవ్యాప్తంగా రోడ్డు భద్రతా మాసోత్సవం నిర్వహిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు నేడు పలు జిల్లాల్లో అవగాహన కార్యక్రమాల్లో మంత్రులు పాల్గొంటున్నారు
మాజీ మంత్రి హరీశ్‌రావు సిట్ విచారణకు హాజరుకావడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది ప్రభుత్వం కావాలనే నోటీసులు ఇస్తోందని ఆయన ఆరోపిస్తున్నారు
హైదరాబాద్‌లో ప్రారంభమైన సీ-మిత్ర కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది బాధితులు పోలీస్ స్టేషన్‌కు రాకుండానే ఇంటి వద్ద నుంచే ఏఐ సాయంతో ఫిర్యాదు చేసే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది
అశ్లీల వీడియోలు చూసే వారిపై తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు నిఘా పెంచారు ఇటీవల ఈ విషయంలో పలువురు యువకులపై కేసులు నమోదయ్యాయి
ఆదిలాబాద్ జిల్లాలో పాతిపెట్టిన మృతదేహం తల మాయమైన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది క్షుద్రపూజల కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు
టీ20 ప్రపంచకప్ 2026: భారత్-శ్రీలంక వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో బంగ్లాదేశ్ జట్టు రాకపై సందిగ్ధత నెలకొంది. బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్‌ను తీసుకునే అవకాశం ఉందని ఐసీసీ ICC వర్గాలు భావిస్తున్నాయి
Ind vs NZ 2nd T20I భారత్ న్యూజిలాండ్ మధ్య నేడు రెండో టీ20 మ్యాచ్ జరగనుంది ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్ టీమ్‌కు కలిసి రానుంది
స్థానిక ప్రతిభ ఐపీఎల్ వేలంలో రాజస్థాన్ రాయల్స్ దక్కించుకున్న హైదరాబాదీ ప్లేయర్ అమన్ రావు విజయ్ హజారే ట్రోఫీలో డబుల్ సెంచరీతో వార్తల్లో నిలిచారు
బిజెపి - కాంగ్రెస్ - ఎంఐఎం పొత్తు.....? మహారాష్ట్రలోని అచల్‌పూర్ మున్సిపాలిటీలో చోటుచేసుకున్న ఈ అరుదైన పొత్తు జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది
తాజాగా విడుదలైన పాస్‌పోర్ట్ ర్యాంకింగ్స్‌లో భారత పాస్‌పోర్ట్ శక్తి మరింత మెరుగుపడింది
అమెరికాలోని 19 రాష్ట్రాల్లో తీవ్రమైన మంచు తుపాను ముప్పు ఉందని లక్షలాది మందికి విద్యుత్ సరఫరా నిలిచిపోయే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది
ప్రధాని మోదీ ఈరోజు ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 18వ రోజ్‌గార్ మేళాను ప్రారంభించనున్నారు దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖలలో ఎంపికైన సుమారు 61,000 మంది యువతకు ఆయన నియామక పత్రాలను పంపిణీ చేస్తారు ఈ సందర్భంగా ఆయన నూతనంగా ఎంపికైన అభ్యర్థులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు హోం శాఖ ఆరోగ్య శాఖ ఉన్నత విద్యా శాఖ వంటి కీలక విభాగాలలో ఈ నియామకాలు జరుగుతున్నాయి
మోది భారత్ పర్యటన
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ నిన్నటి నుంచి ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు
నిన్న మధురాంతకం చెన్నై సమీపంలో బహిరంగ సభలో పాల్గొన్న మోది ఈరోజు కూడా రాష్ట్రంలోని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసే అవకాశం ఉంది
మోది తమిళనాడులో మార్పు కోసం ప్రజలు సిద్ధంగా ఉన్నారని 'డబుల్ ఇంజిన్' సర్కార్ రావాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన వ్యాఖ్యానించారు