ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలంటూ డి.ఈ.ఓ కు వినతి పత్రం అందజేసిన యుటిఫ్ నాయకులు.
నంద్యాల (ప్రజా పక్షం): సెలవుల్లో కూడా పాల్గొనే ఉపాధ్యాయులకు సీసీఎల్ మంజూరు చేయాలని యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి ప్రసాద్ డిమాండ్ చేశారు. బుధవారం డీఈఓ జనార్ధన్ రెడ్డి ని కలిసి ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలంటూ వినతి పత్రం అందజేసిన యుటిఎఫ్ నాయకులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదివారం సెలవు ప్రకటించాలని,ఉదయం, సాయంత్రం వేళల్లో ఉండే విద్యార్థులకు స్నాక్స్ అందించాలని,సెలవు రోజుల్లో పాల్గొనే ఉపాధ్యాయులకు CCL లు మంజూరు చేయాలని,ఆదివారం ను వర్కింగ్ డే కాకుండా.యధావిధిగా ఆదివారం సెలవు ప్రకటించాలని కోరారు.