
రహదారి ప్రమాదాలపై అవగాహన కల్పిస్తున్న ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ చాంద్ బాషా.
నంద్యాల (AIMA MEDIA): జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నివారణ కార్యక్రమాల్లో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించాలన్న నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఆదేశాలమేరకు నంద్యాల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ చాంద్ బాషా వారి సిబ్బందితో కలిసి నంద్యాల పట్టణంలోని ముఖ్యమైన కూడళ్లలో మరియు ఆటో స్టాండ్ ల వద్ద రోడ్డు భద్రత నిబంధనలపై నంద్యాల పట్టణ ప్రజలకు మరియు ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నియమాలు మరియు రహదారి భద్రత పై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ చాంద్ భాషా మాట్లాడుతూ ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ సురక్షితమైన ప్రయాణాలు చేయాలని అతివేగంగా వాహనాలు నడప రాదని ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులను దృష్టిలో ఉంచుకొని బాధ్యతాయుతంగా వాహనాలు నడపాలని తెలియజేశారు.ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించేవారు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని సూచించారు.అతి వేగం, నిర్లక్ష్యం ప్రాణాలకు ప్రమాదకరమని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని, వాహన పరిమితికి మించి ఆటోలలో ప్రయాణికులను చేరవేరాదని అవగాహన కల్పించారు.