
కర్ణాటకలో రాసలీలల డిజిపి స్థాయి అధికారి రామచంద్రరావు సస్పెండ్ అయ్యారు. ఆయన ఇదివరకే సినీ నటి, తన సవతి కూతురు రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ప్రమేయం
కర్ణాటకలో రాసలీలల డిజిపి స్థాయి అధికారి రామచంద్రరావు సస్పెండ్ అయ్యారు. ఆయన ఇదివరకే సినీ నటి, తన సవతి కూతురు రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ప్రమేయం ఉందని నిర్ధారణ అయిన తర్వాత మళ్లీ అతడిని అదే స్థాయిలో అధికారిగా నియమించడమే తప్పు . రాసలీలల డిజిపి రామచందర్రావు గతంలో బంగారం స్మగ్లింగ్ కేసులో, దొరికిపోయిన కన్నడ సినీ నటి రమ్య రావుకు సవతి తండ్రి . ఆమె తల్లిని అతడు వివాహం చేసుకున్నాడు . తన సవతి తండ్రి రామచంద్రరావు డిజిపి స్థాయి పదవిని అడ్డం పెట్టుకొని రన్యారావు విమానాల్లో బంగారం స్మగ్లింగ్ కు పూనుకుంది. గల్ఫ్ దేశాల నుంచి కిలోల కొద్ది బంగారం తీసుకొచ్చేది. బెంగళూరు కెంపెగౌడ విమానాశ్రయంలో తండ్రి పదవి అడ్డం పెట్టుకొని లగేజి చెకింగ్ లేకుండా బయటకు వచ్చేది. ఇలా మూడు నెలల్లోనే ఆమె అనేకసార్లు గల్ఫ్ దేశాలకు పోయినట్టు, చెకింగ్ లేకుండా బయటకు వచ్చినట్టు రికార్డులు స్పష్టం చేశాయి. .ఇదంతా చూసిన డిఆర్ఐ అధికారులు ఒకరోజు ఆమెను చెక్ చేయగా 14 కిలోల బంగారంతో పట్టుబడింది. అయితే తన కూతురు వ్యాపారంతో తనకే సంబంధం లేదని రామచంద్రరావు తప్పించుకున్నాడు. అయినప్పటికీ అతని ప్రమేయం ఉందని తెలుసుకున్న తర్వాత అతన్ని నిర్బంధ సెలవులో ప్రభుత్వం పంపించింది . ఇదే సాధారణ అధికారయితే సస్పెండ్ చేసి జైలుకు పంపేవారు. కానీ డిజెపి స్థాయి అధికారి కాబట్టి అతడిని సెలవుపై మాత్రమే పంపించి రెండేళ్లు జీతం ఇచ్చారు. ఆ తర్వాత మళ్లీ పోస్టింగ్ ఇచ్చి పౌర హక్కుల చట్టం అమలు విభాగానికి డీజీపీగా చేశారు. అయినప్పటికీ తన నీచ బుద్ధి పోనిచ్చుకోకుండా ఆఫీసులోనే రాసలీలలు మొదలుపెట్టారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు పలువురు మహిళలతో ఆఫీసులోనే అసభ్యంగా బ్లూ ఫిల్ములు తలపించే విధంగా అతని చేసిన రాసలీలలు వీడియో రూపంలో బయటికి రావడంతో సంచలనమైంది. ఇప్పుడు ఎట్టకేలకు ప్రభుత్వం అతనిని సస్పెండ్ చేసింది. ఒక కేసులో దొంగని తేలిన తర్వాత మళ్లీ అతడిని అదే పదవిలో కొనసాగించడం మళ్ళీ ఇలాంటి నీచ కార్యక్రమాలుకు పాల్పడడం చూస్తుంటే ఉన్నత స్థాయిలో ఉన్న అధికారులు ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది . ఎలాగోలాగా మళ్లీ ఉద్యోగాల్లోకి వచ్చేస్తారు అన్న అభిప్రాయం సాధారణ ప్రజల్లో కూడా ఉంది..