వైద్యుల నిర్లక్ష్యానికి మహిళ బలి? హన్మకొండలో విషాదం వైద్యుల నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుందని బాధితులు ఆరోపిస్తున్నారు.
వైద్యుల నిర్లక్ష్యానికి మహిళ బలి? హన్మకొండలో విషాదంవైద్యుల నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుందని బాధితులు ఆరోపిస్తున్నారు. సరైన సమయంలో సరైన వైద్యం అందించి ఉంటే ప్రాణాలు దక్కేవని కన్నీరుమున్నీరవుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పెద్దపూర్ గ్రామానికి చెందిన కన్నురి రజిత (40) మృతి చెందడంతో ఆమె కుటుంబంలో పెను విషాదం నెలకొంది.మూడు రోజుల క్రితం రక్తకణాల (ప్లేట్లెట్స్) సంఖ్య తగ్గడంతో బాధితురాలిని హన్మకొండలోని అభయ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స అందించే క్రమంలో ఆసుపత్రి యాజమాన్యం, సిబ్బంది సరైన శ్రద్ధ చూపలేదని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. పరిస్థితి విషమించడంతో 19-01-2026 రాత్రి బాధితురాలిని చక్రవర్తి ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందిస్తుండగానే ఆమె కన్నుమూశారు.అభయ ఆసుపత్రి నిర్లక్ష్యం వల్లే తన తల్లి మరణించిందని రజిత కుమారుడు ఆరోపిస్తున్నారు. మొదటి ఆసుపత్రిలో సిబ్బంది బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం వల్లే ప్రాణాపాయం సంభవించిందని బాధితులు వాపోతున్నారు. చికిత్స విషయంలో అలసత్వం వహించిన వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రాణాలు కాపాడాల్సిన చోట బాధ్యత లోపించడంపై స్థానికంగా నిరసన వ్యక్తమవుతోంది.తమకు న్యాయం చేయాలంటూ ఆసుపత్రి వద్ద కుటుంబ సభ్యుల ఆందోళన.