logo

రావికమతం బిజెపి నాయకులు ఆధ్వర్యంలో ఆనంద్ కుమార్ పుట్టినరోజు వేడుకలు

అనకాపల్లి జిల్లా రావికమతం రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు ఆడారి ఆనంద్ కుమార్ కి రావికమతం మండల బీజేపీ అధ్యక్షులు గూటాల చిన్న, మండల ప్రధాన కార్యదర్శి దంట్ల సత్యనారాయణ మరియు మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా మండల బీజేపీ అధ్యక్షులు గూటాల చిన్న మాట్లాడుతూ, "ఆనంద్ కుమార్ పార్టీ కోసం అంకితమైన నాయకుడు. ఆయన ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, ఆయురారోగ్యాలతో ఉండి పార్టీకి మరింత సేవ చేయాలని ఆకాంక్షిస్తున్నాము" అని తెలిపారు.మండల ప్రధాన కార్యదర్శి దంట్ల సత్యనారాయణ సహా మండలంలోని అందరూ ఆనంద్ కుమార్ ఆరోగ్యం, దీర్ఘాయుష్షు కోరుతూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ శుభాకాంక్షలు పార్టీ సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేయబడ్డాయి.

5
676 views