logo

కడప కాంగ్రెస్ పార్టీ యువతను కలిసిన జాతీయ యువజన కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ.

కడప కాంగ్రెస్ పార్టీ యువతను కలిసిన జాతీయ యువజన కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ.

కడప జనవరి 18 SBNEWS9550

యువజన కాంగ్రెస్ ఎన్నికలు జరగనున్న సందర్భంగా ఆదివారం జాతీయ యువజన కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ లెనిన్ ప్రసాద్ కడప కాంగ్రెస్ యువతను కలవడం జరిగింది.
జిల్లా అధ్యక్షులు ఎన్ డి విజయ జ్యోతి ఆదేశాలననుసరిస్తూ, కడప నగర అధ్యక్షుడు సయ్యద్ గౌస్ పీర్, యూత్ కాంగ్రెస్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ సుశీల్ కుమార్ కలిసి లెనిన్ ప్రసాద్ ని స్వాగతించారు. రాబోయే యూత్ కాంగ్రెస్ ఎన్నికల సందర్భంగా లెనిన్ ప్రసాద్ యూత్ కాంగ్రెస్ నందు పోటీ చేయు ఆశావాహులను కలవడం జరిగింది. ఈ ఎన్నికల పద్ధతులను వివరించడం జరిగింది. పోటీ చేయు వారికి ఉత్సాహపరుస్తూ మాట్లాడటం జరిగింది. కాంగ్రెస్కు ఆయూ పట్టు లాంటిది యూత్ కాంగ్రెస్ అని మనము ఉత్సాహంగా ఉల్లాసంగా ముందుకు సాగాలని, రాహుల్ గాంధీ ని ప్రధానమంత్రి చేయడం మన లక్ష్యమని వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు ఆయనను సత్కరించుకున్నారు. యువ నాయకులు కరీం,సిద్ధిక్, మస్తాన్ వల్లి, సుబ్రహ్మణ్యం, మహమ్మద్ సోహెబ్, షేక్ సోయాబ్, అబ్బాస్, డివిజన్ ఇన్చార్జులు జాబిర్ అలీ, అంజన్ కుమార్, షామీర్ హుస్సేన్, సర్దార్ భాష, అట్లూరు మండల ప్రెసిడెంట్ గంగయ్య తో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

0
24 views