
మన్యం చలపతి నాయుడు ఆధ్వర్యంలోఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు
కడప
ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు
కడప
SBNEWS9550
కడప నగరంలోని చిన్న చౌక్ దగ్గర ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి తెలుగుదేశం నాయకులు మన్యం చలపతి నాయుడు. శంకరయ్య హరిప్రసాద్ అమీర్ బాబు లక్ష్మిరెడ్డి ఘనంగా వర్ధంతి వేడుకలను నిర్వహించారు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజమే దేవాలయం ప్రజల దేవుళ్ళు అని నమ్మి 1982లో నందమూరి తారక రామారావు ప్రజలకు ఏదైనా మేలు చేయాలని ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ స్థాపించారని రాజకీయాలంటే భూస్వాములకు ధనికులకు దోపిడిదారులకే ఉండేవని అలాంటి పరిస్థితుల్లో ప్రతి పేదవానికి రాజకీయాలంటే సామాన్యుల దగ్గరికి తెచ్చాడని పేద ప్రజలకు కూడు గూడు గుడ్డ అనే సౌకర్యాలను ప్రతి ఒక్కరికి అందించాలని తపనతో పార్టీ పెట్టారని వాటన్నిటిని విజయవంతం చేశారని తెలిపారు వృద్ధులకు 75 రూపాయలు పెన్షన్ ప్రవేశపెట్టి నేడు దేశంలో ఎక్కడలేని విధంగా నాలుగు వేల రూపాయలు అందిస్తున్నారని ఆయన తెలిపారు తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ ప్రవేశపెట్టి విజయవంతంగా కొనసాగిస్తున్నారు పేద ప్రజలకు మేలు జరగాలంటే ఒక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమవుతుంది అని తెలిపారు కొంతమంది దుష్టశక్తులు కొన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీని నాశనం చేయడానికి వైసిపి వాళ్లను పార్టీలోకి చేర్చుకుంటున్నారన్నారు పార్టీకి కార్యకర్తలు అందని ప్రతిసారి నిరూపించబడిందన్నారు పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారిని లోకేష్ నాయుడు చంద్రబాబు నాయుడు గుర్తించి కార్యకర్తలకు సమన్యాయం చేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో శివ కొండారెడ్డి, కొండ సుబ్బయ్య ,నల్లపాటి లక్ష్మీనారాయణ , పసుపులేటి నాగ మునయ్య, బండి జయ శేఖర్ నాగేశ్వరరావు, పూర్ణచంద్ర, వెంకటరమణ ,శివ శంకర్ రెడ్డి, రఘురామయ్య ,బిజెపి రాష్ట్ర నాయకుడు బాలకృష్ణ యాదవ్ యాదవ్ ,జనసేన నాయకుడు జివి రమణ తదితరులు పాల్గొన్నారు