logo

శారదామృత సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళా యాచకులు మరియు దివ్యాంగులకు చీరల పంపిణీ

పెనుమంట్ర మండలం, మార్టేరు గ్రామంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని శారదామృత సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళా యాచకులు మరియు దివ్యాంగులకు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు మహిళా యాచకులు, దివ్యాంగులకు కొత్త చీరలను అందజేసి పండుగ సందర్భంగా సహాయాన్ని అందించారు.
ఈ సందర్భంగా ట్రస్ట్ ప్రతినిధులు మాట్లాడుతూ, సేవా భావంతో పండుగలను సమాజంలోని అట్టడుగు వర్గాలతో కలిసి జరుపుకోవడమే తమ లక్ష్యమని తెలిపారు. సంక్రాంతి వంటి సంప్రదాయ పండుగలు అందరికీ ఆనందాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వెల్లడించారు.

1
66 views