logo

తెలుగువాడి ఆత్మగౌరవానికి ఆళ్లగడ్డలో చోటు లేదా?

AIMA న్యూస్.తెలుగు జాతి గర్వపడేలా చేసిన సినీ నటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు నేడు ఆ మహనీయుని 30వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించుకుంటూ AIMA న్యూస్ ప్రత్యేక కథనం. ఆళ్లగడ్డలో ఎన్టీఆర్ విగ్రహం లేకపోవడం దురదృష్టకరం. పట్టణానికి కొత్త శోభ రావాలంటే ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయాలంటున్న ప్రజలు ఆయన విగ్రహం లేని ఊరు తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా ఉండదు. కానీ, రాజకీయాలకు, కళలకు పెట్టింది పేరైన నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఆ యుగపురుషుని విగ్రహం లేకపోవడం ప్రతి తెలుగువాడినీ ఆలోచింపజేస్తోంది.
ఆ మహానుభావుడి విగ్రహం ఉంటే, అది కేవలం ఒక విగ్రహం మాత్రమే కాదు. మన సంస్కృతికి, క్రమశిక్షణకు ఒక నిలువుటద్దం. ఇప్పటికైనా పార్టీలకు అతీతంగా అభిమానులు, పెద్దలు స్పందించి ఆళ్లగడ్డలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు నడుం బిగించాలి.
రాజకీయ చైతన్యం ఉన్న ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఎందరో నాయకులు ఎదిగారు. కానీ, రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు తెచ్చి తెలుగు అనే పదానికి నిండుతనం తెచ్చిన ఎన్టీఆర్ విగ్రహం పట్టణంలో లేకపోవడం వెలితిగా ఉంది.ఆయన కేవలం ఒక పార్టీకి పరిమితమైన వ్యక్తి కాదు, తెలుగు వారి గుండెల్లో నిలిచిన దైవం. త్వరలోనే తగిన స్థలాన్ని కేటాయించి, ఒక భవ్యమైన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఆళ్లగడ్డ తాలూకా ప్రజలు ఎన్టీఆర్,తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు,అభిమానులు కోరుతున్నారు.

63
2128 views