logo

మర్రి నరేష్ నేటి ప్రత్యేక వార్త : మేతారం జాతర తర్వాత తెలంగాణలో రెండో అతిపెద్ద గిరిజన పండుగ నాగోబా జాతర

నాగోబా జాతర ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రస్తుత మంచిర్యాల ఆసిఫాబాద్ ఆదిలాబాద్ పరిధిలోని ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలో జరుగుతుంది ఇది ప్రధానంగా మేస్రం వంశీయుల గోండు గిరిజనులు పండుగ జాతరకు కొన్ని రోజుల ముందే మేస్రం వంశీయులు కాలినడకన వెళ్లి గోదావరి నది హస్తినమడుగు నుండి పవిత్ర గంగాజలాన్ని తీసుకువస్తారు సుమారు 150 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేస్తారు గంగాజలంతో తిరిగి వచ్చిన తర్వాత వారు కేస్లాపూర్ గ్రామం వెలుపల ఉన్న ఒక పురాతన మర్రి చెట్టు కింద కొన్ని రోజులు విడిది చేస్తారు దీనిని ఆలయ ప్రవేశానికి ముందు శుద్ధిగా భావిస్తారు అమావాస్య రోజు రాత్రి వేళ నాగోబా శేషనారాయణ మూర్తి విగ్రహానికి పవిత్ర జలంతో అభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు జనవరి 18: రాత్రి 10 గంటలకు మహాపూజతో జాతర ప్రారంభం.
జనవరి 20: పెర్సపేన్ పూజ మరియు భాన్ దేవత పూజలు.
జనవరి 22: గిరిజన దర్బార్ నిర్వహణ.
జనవరి 23: భేతల్ పూజలతో మెస్రం వంశీయుల సంప్రదాయ పూజల ముగింపు ఈ జాతర సందర్భంగా ప్రభుత్వం ప్రజా దర్బార్ నిర్వహిస్తుంది ఇందులో గిరిజనులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువస్తారు మేస్రం వంశంలోకి కొత్తగా వచ్చిన కోడళ్లను నాగోబా దేవతకు పరిచయం చేసే భేటింగ్ అనే కార్యక్రమం ఇక్కడ చాలా ప్రత్యేకం ఈ ప్రక్రియ పూర్తయ్యాకే వారు ఆ వంశీయులుగా గుర్తింపు పొందుతారు గిరిజనుల సంప్రదాయ నృత్యమైన గుసాడి ఈ జాతరలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది పుట్ట మట్టితో చేసిన పాత్రలలోనే వంటలు చేసి దైవానికి నైవేద్యంగా సమర్పిస్తారు ప్రతి ఏటా పుష్య మాసంలో సాధారణంగా జనవరి లేదా ఫిబ్రవరి నెలల్లో వచ్చే అమావాస్య రోజున ఈ జాతర ప్రారంభమవుతుంది సుమారు 5 నుండి 10 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి నాగోబా జాతరలో దృశ్యాలు చాలా ప్రసిద్ధమైనవి తెల్లని రంగులో మెరిసిపోయే కొత్తగా నిర్మించిన ఆలయ గోపురం మేస్రం వంశీయులు భుజాన కావడి పెట్టుకుని కాలినడకన వెళ్లే వందలాది మంది గిరిజనులు గుడారాలు వేసుకుని విడిది చేసే పవిత్రమైన మర్రి చెట్టు నెమలి పింఛాలతో అలంకరించుకున్న గిరిజన నృత్య కళాకారులు గిరిజన ఆచారాల ప్రకారం చేసే ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది

98
4353 views