logo

వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పోలీసు సేవలు పొందండి: విజయనగరం జిల్లా ఎస్పీ ఏ.ఆర్. దామోదర్ పిలుపు


డిజిటల్ పాలనలో భాగంగా ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత సులభంగా, త్వరితంగా మరియు పారదర్శకం గా అందించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేసపెట్టిన వాట్సాప్ గవర్నెన్స్ ఫీచర్లను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ జనవరి 17న ఒక ప్రకటనలో తెలిపారు.
విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ మాట్లాడుతూ - డిజిటల్ పాలనలో భాగంగా ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత సులభంగా, పారదర్శకంగా మరియు వేగవంతంగా అందించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు. ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలు సులభంగా ఇంటివద్ద నుండే పోలీసు సేవలను పొందవచ్చునన్నారు. ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలు పోలీసుశాఖ సేవలైనటువంటి 📍*ఎఫ్ఐర్, ఎఫ్ఐఆర్ ప్రస్తుత స్థితి, ఈ-చలాన్ వివరాలు *సంబంధిత పోలీస్ స్టేషనుకు వెళ్ళకుండానే సులభంగా పొందవచ్చునని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ వాట్సాప్ గవర్నెన్స్ సేవలను పొందుటకు ప్రజలు ముందుగా 📌*9552300009*📌 సెల్ నంబరును వారి మొబైల్ ఫోనులో సేవ్ చేసుకొని, ఆ నంబర్కు “హాయ్” అని మెసేజ్ చేయగానే వివిధ రకాల ప్రభుత్వ సేవలు వివరాలు మొబైల్ కు వస్తాయన్నారు. అందులో పోలీసుశాఖ సేవలను ఎంచుకొని *ఎఫ్ఐఆర్, ఎఫ్ఐఆర్ స్థితి, ఈ-చలాన్ వివారాలు* సులభంగా ఇంటివద్ద నుండే పొందవచ్చునన్నారు. ఈ క్రింద ఇవ్వబడిన క్యుఆర్ కోడును స్మ్యాన్ చేసి కూడా పైన తెలపబడిన పోలీసు సేవలు తక్షణమే పొందవచ్చునన్నారు. ఈ క్యూఆర్ కోడ్ను జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్లలో, పోలీసు ఆఫీసులలో అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. ఈ మనమిత్ర (వాట్సాప్ గవర్నెన్స్)ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దీని ద్వారా ప్రజల సమయాన్ని ఆదా చేసుకోవడమే కాకుండా, ప్రభుత్వం, ప్రజల మధ్య సంబంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ అన్నారు.

0
99 views