logo

ఎస్.కొత్తూరు గ్రామంలో ఘనంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గ్రామోత్సవం.

పాణ్యం (AIMA MEDIA): పాణ్యం మండలం ఎస్.కొత్తూరు గ్రామంలో వెలిసిన ప్రముఖ శైవక్షేత్రం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం నందు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గ్రామోత్సవం గురువారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఈవో యం.రామక్రిష్ణ, ఆలయ ప్రధాన అర్చకులు కంపమల్ల సురేష్ శర్మ ఆధ్వర్యంలో గురువారం ఉదయం శ్రీ స్వామివారికి అభిషేకం, అర్చనలు, విశేష పూజలు నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించారు. సాయంత్రం గ్రామ పెద్దలు, ప్రజలు, ఆలయ అర్చకులు మరియు సిబ్బంది ఆధ్వర్యంలో శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తులను గ్రామ పురవీధుల గుండా బాజా భజంత్రీలు, డప్పు వాయిద్యములు, బాణా సంచారంతో గొప్ప ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మిలిటరీ సుబ్బారెడ్డి, బీరం శివరామిరెడ్డి, ప్రధాన అర్చకులు వీరయ్య స్వామి, పోలీస్ సిబ్బంది ఏఎస్ఐ రఫీ, గ్రామ పెద్దలు, ప్రజలు, ఆలయ సిబ్బంది తదితరులు అధిక సంఖ్యలో భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.

1
508 views