logo

"వస్త్రధానం" చేసిన 'అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ '


విజయనగరం, జనవరి 16:

సంక్రాతి పండుగ సందర్బంగా అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో క్లబ్ అధ్యక్షులు సి హెచ్ రమణ అయ్యన్నపేట జంక్షన్, జగదాంబ నగర్లో ఉన్న పలువురు వృద్దులకు, పారిశుధ్య కార్మికులకు నూతన వస్త్రాలు, తువ్వాళ్ళు,పంచెలను గురువారం ఉదయం, శుక్రవారం ఉదయం పంచిపెట్టారు.

ఈ సందర్బంగా క్లబ్ గౌరవ అధ్యక్షులు త్యాడ రామకృష్ణారావు(బాలు) మాట్లాడుతూ సంక్రాతి పండుగ సందర్బంగా సందర్బంగా పారిశుధ్య కార్మికులకు,పేదలకు, వృద్ధులకు వస్త్రధానం చేయడం గొప్ప ధాత్రుత్వమని, సంక్రాంతి పండుగ వేళ దానం చేయడం వల్ల గత కర్మ అడ్డంకులు తొలగిపోయి, జీవితంలోకి శాంతి, విజయం, మరియు సంపద ప్రవేశిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయని, చిన్న సహాయం కూడా ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపుతుందని, వారికి ఆనందాన్ని పంచుతుందని అన్నారు.

కార్యక్రమం లో క్లబ్ కార్యదర్శి కోట్ల ఈశ్వరరావు, జాలీవాకర్ వై. నలమహారాజు,క్లబ్ పెద్దలు కోట్ల సత్యనారాయణ, తాడ్డి ఆదినారాయణ,జి. గోవిందరావు, కె.రమేష్, గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు.

0
35 views