logo

విజయనగరం జిల్లాలో డ్రోన్ల నిఘా: నేర నియంత్రణే లక్ష్యం - ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపీఎస్



విజయనగరం జిల్లాలో పండుగ సందర్భంగా నేరాలను నియంత్రించుటకు డ్రోన్లను వినియోగించి, నిఘా ఏర్పాటు చేసి, నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లుగా జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ జనవరి 16న తెలిపారు.
జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ గారి ఆదేశాలతో పట్టణాల్లోను, గ్రామ శివార్లలోను నేరాలను నియంత్రించుటకు చర్యలు చేపడుతున్నారన్నారు. రద్దీ ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేసేందుకు, నేరాలను నియంత్రించుటకు డ్రోన్స్ వినియోగిస్తున్నామన్నారు. డ్రోన్ విజువల్స్ సహకారంతో పట్టణంలో ట్రాఫిక్ రెగ్యులేట్ చేయడంతోపాటు నేరాలను నియంత్రించుటకు, అనుమానస్పద వ్యక్తులపై నిఘా పెట్టేందుకు, రద్దీ ప్రాంతాల్లో డ్రోన్స్ను పంపి, ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నామని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ తెలిపారు.
బహిరంగ ప్రదేశాల్లో అసాంఘిక కార్యక్రమాలు చేపట్టే వారిపై నిఘా ఏర్పాటు చేసేందుకు, ప్రజాశాంతికి భంగం కలిగించే వారిపైన, ఓపెన్ డ్రింకింగు చేసే వారిపైన, కోడి, గొర్రి పందాలు నిర్వహించే వారిపై డ్రోన్స్ను పంపి, చట్ట వ్యతిరేక కార్యక్రమాలను నియంత్రిస్తున్నామన్నారు. నేర నియంత్రణలో సాంకేతికతను, డ్రోన్స్ను వినియోగిస్తూ, నేరాలను నియంత్రించేందుకు చర్యలు చేపడుతున్నట్లుగా జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ తెలిపారు.
అదే విధంగా పండగ ముగించుకొని వారి గమ్య స్థానాలకు చేరుకొనే ప్రజలు రహదారి భద్రత నియమాలను పాటిస్తూ క్షేమంగా గమ్య స్థానాలకు చేరాలని జిల్లా ఎస్పీ సూచించారు. వాహన దారులు హెల్మెట్ ధరించడం, సీటు బెల్ట్ ధరించడం, మద్యం సేవించి వాహనం నడపకూడదని, వేగ నియంత్రణ పాటించాలని, వేరే జిల్లాలకు మరియు దూర ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళు పోలిసుల సహకారం తీసుకొని ప్రత్యామ్నాయ దారులలో సులభంగా గమ్య స్థానాలకు చేరుకోవచ్చని జిల్లా ఎస్పీ తెలిపారు. “హ్యాపీ మరియు సేఫ్ రిటర్న్ జర్నీ” అనే నినాదంతో ప్రజలకు పిలుపునిచ్చిన జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపీఎస్.
.

0
265 views