logo

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన డిఎంహెచ్వో.

బండి ఆత్మకూరు (AIMA MEDIA): బండి ఆత్మకూరు మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జనవరి 14వతేది బుధవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెంకటరమణ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా హాజరు పట్టిక పరిశీలించి ఓపి ల్యాబ్ ఫార్మసీ గదిని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరోగ్య కేంద్రాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు సిబ్బంది కూడా తప్పనిసరిగా హాజరుకావాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సిబ్బంది దీర్ఘకాలిక పేషెంట్లకు పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేయాలని, సిబ్బంది తీసుకోవాల్సిన కొన్ని విషయాలపై సూచన సలహాలు చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సవిత ఫార్మసిస్ట్ సుబ్బారావు స్టాఫ్ నర్స్ సాహిన్ ల్యాబ్ టెక్నీషియన్ తిరుమలేష్ పాల్గొన్నారు.

4
421 views