logo

*జెడ్పీ చైర్‌పర్సన్ నివాసంలో భోగీ – సంక్రాంతి పండుగ వేడుకలు*


మన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను గుర్తు చేస్తూ భోగీ – సంక్రాంతి పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎడ్ల బండి, నాగలి, మట్టి పాత్రలు, ధాన్యం రాశులు, రంగురంగుల హరివిల్లు ముగ్గులు, పలు రకాల పిండివంటలు, చిన్నారుల కోలాటాలు, గంగిరెద్దులు, హరిదాసుల సందడి నడుమ భోగీ కార్యక్రమం కనుల పండుగగా సాగింది.
భోగీ మరియు సంక్రాంతి పండుగలను పురస్కరించుకుని విజయనగరం నగరంలోని వసంత విహార్‌లో ఉన్న తమ నివాసంలో ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్‌పర్సన్, వైఎస్సార్ సీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త గౌరవనీయులు శ్రీ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) ఘనంగా పండుగ వేడుకలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆయన సతీమణి శ్రీమతి మజ్జి పుష్పాంజలి , అల్లుడు నెల్లిమర్ల నియోజకవర్గ వైఎస్సార్ సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ప్రదీప్ నాయుడు, కుమార్తె చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరమ్మ
,కుటుంబ సభ్యులు, బంధువులు మరియు ఆత్మీయులు పాల్గొన్నారు.
భోగీ పండుగ సందర్భంగా సంప్రదాయబద్ధంగా భోగీ మంటలు వేసి తిలకిస్తూ పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఇంటి ప్రాంగణం సంప్రదాయ పండుగ వాతావరణంతో కళకళలాడింది.

10
795 views