logo

అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు: మంత్రి గుమ్మిడి సంధ్యారాణి



సాలూరు: రాష్ట్ర ప్రజలకు స్త్రీ,శిశు సంక్షేమ శాఖ, గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
మక్కువ మండలం, వెంకంపేట గ్రామంలో సంక్రాంతి సంబరాలలో భాగంగా వాలీబాల్, ఎడ్ల బండి పందాల పోటీలను మంత్రి సంధ్యారాణి తండ్రి మాజీ ఎమ్మెల్యే,దివంగత జన్ని ముత్యాలు జ్ఞాపకార్థం పార్టీ అధ్యక్షులు జి. వేణుగోపాలరావు నిర్వహించారు. సంబరాలలో బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర జిల్లా వాసులు ఉత్సాహంగా పాల్గొన్నారు. తలపాగా ధరించి రైతులతో కలిసి మంత్రి ఉత్సాహంగా పాల్గొన్నారు.

1
293 views