logo

జిల్లాలో అక్షర ఆంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయండి: ఇంచార్జి జిల్లా కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ


*జిల్లాలో అక్షర ఆంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయండి: ఇంచార్జి జిల్లా కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ*

- *జిల్లాలోని వయోజనులందరినీ అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే ఉల్లాస్ ఫేస్ -2 అక్షర ఆంధ్ర ప్రధాన లక్ష్యమని, ఆ దిశలో ఈ కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో జిల్లాలో అమలు చేసి సంపూర్ణ అక్షరాస్యత సాధించాలని ఇంచార్జి జిల్లా కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ పేర్కొన్నారు.*
- *సోమవారం సాయంత్రం మానవ వనరుల అభివృద్ధి శాఖ సెక్రటరీ కోన శశిధర్ గారు, వయోజన విద్య రాష్ట్ర సంచాలకులు రంజిత్ భాషాతో కలిసి అక్షర ఆంధ్ర కార్యక్రమం అమలుపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించి దిశా నిర్దేశం చేశారు.*
- *ఈ సందర్భంగా కోన శశిధర్ మాట్లాడుతూ 2029 నాటికి సంపూర్ణ అక్షరాస్యత సాధించిన రాష్ట్రం లక్ష్యంగా ప్రతి ఏడాది 25 లక్షల మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దుతూ మూడు సంవత్సరాలకు 81 లక్షల మందిని అక్షరాస్యులుగా తయారు చెయ్యాల్సి ఉందని తెలిపారు. జిల్లాలో కలెక్టర్లు సదరు అక్షర ఆంధ్ర కార్యక్రమం అమలును ఎప్పటికప్పుడు పర్యవేక్షించి సత్ఫలితాలు రాబట్టాలని పేర్కొన్నారు.*
- *వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఇంచార్జి కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అధికారులు సమన్వయంతో చిత్తశుద్ధితో అక్షర ఆంధ్ర కార్యక్రమాన్ని అమలు చేసి సంపూర్ణ అక్షరాస్యత సాధించాలన్నారు. ప్రతి ఒక్క వయోజనులకు 100 గంటల టీచింగ్ ప్లాన్ మేరకు ఇందులో చదవడం, రాయడం, న్యూమరసి, డిజిటల్ లిటరసీ పై శిక్షణ ఇవ్వాలన్నారు. క్లాస్ రూమ్, వర్క్ షీట్, వీడియో క్లాసెస్ ద్వారా బోధన ఉంటుందన్నారు. వయోజనులకు బోధన చేసేందుకు వాలంటీర్ టీచర్లను వినియోగించుకోవాలని, వారు ఎంత ఎక్కువ మందిని అక్షరాస్యులను చేస్తే సదరు వాలంటీర్ టీచర్లకు కాంస్య, సిల్వర్, గోల్డ్, ప్లాటినం ప్రశంసా పత్రాలను అక్షరాస్యత దినోత్సవం రోజున అందించడం జరుగుతుందని, అలాగే టాప్ పెర్ఫార్మెన్స్ ఉన్న సంబంధిత జిల్లా కలెక్టర్లకు కూడా ప్రశంస ఉంటుందని పేర్కొన్నారు. క్రమం తప్పకుండా తరగతులు జరిగేలా చూడాలని, యువజనుల హాజరు, వాలంటీర్ టీచర్ హాజరు పర్యవేక్షణ, యాప్ ద్వారా పురోగతిని సమీక్షించడం జరుగుతుందని పేర్కొన్నారు. వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ గ్రామంలో వాలంటీర్ టీచర్లకు ఎలా అటెండెన్స్ తీసుకోవాలి, యాప్ వాడకం వంటి పలు అంశాలపై అవగాహన కల్పించాల్సి ఉంటుందని తెలిపారు. మన అనంతపురము జిల్లాలో 2025- 26 సం.గాను 1,25,578 మంది 15 నుండి 59 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వయోజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని సూచించారు. బోధన వాచకములతో పాటు దృశ్య శ్రవణ వీడియోలు మరియు అభ్యాసన పత్రాల ద్వారా జరగాలని పేర్కొన్నారు. దీనికై సంబంధిత అధికారులు సమన్వయంతో పరస్పర సహకారాలు అందిపుచ్చుకొని జిల్లాను ప్రథమ స్థానంలో ఉండేలా కార్యాచరణ అమలు ఉండాలని అన్నారు.
-ఈ వీడియో కాన్ఫరెన్స్ లో వయోజన విద్య ఉపసంచాలకులు వెంకటేశ్వర్లు, డీఈఓ ప్రసాద్ బాబు, డీపీఓ నాగరాజ నాయుడు, పిడి డ్వామా సలీం భాష, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిణి అరుణ, పిడి డిఆర్డిఎ శైలజ, మెప్మా , జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి బాల కొండయ్య, తదితరులు పాల్గొన్నారు.*

0
0 views