logo

బెంగళూరు-హోస్కోట్ నుండి చెన్నై-శ్రీపెరుంబుదూర్ వరకు ఎక్స్‌ప్రెస్‌వే

(బెంగళూరు)హోస్కోట్ నుండి (చెన్నై) శ్రీపెరుంబుదూర్ వరకు ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణంలో ఉంది, ఇది కర్ణాటకలోని హోస్కోట్ నుండి తమిళనాడులోని శ్రీపెరుంబుదూర్ వరకు 262 కి.మీ. దూరాన్ని కలుపుతుంది, ప్రయాణ సమయాన్ని 6-7 గంటల నుండి 2.5-3 గంటలకు తగ్గిస్తుంది.గరిష్ట వేగ పరిమితి గంటకు 120 కి.మీ.. రహదారి మార్గం: హోస్కోట్, మాలూర్, బంగారపేట్, చిత్తూరు, పలమనేర్, గుడియాతం, అరకుకోణం, శ్రీపెరుంబుదూర్ వంటి ప్రాంతాల మీదుగా సాగుతుంది, ఇది బెంగళూరు-చెన్నై మధ్య కనెక్టివిటీని పెంచుతుంది, ఇప్పటికే కొంత రహదారి అందుబాటులో ఉంది.
బెంగళూరు నుండి బేతమంగళ వరకు 71.7 కి.మీ. దూరం ఇప్పటికే వాహనదారులకు తెరిచి ఉంది.
ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మీదుగా నిర్మాణం జరుగుతోంది కాబట్టి ఈ మార్గం ప్రజలకు చాలా ప్రయోజనాలను కలిగిస్తుంది.
బెంగళూరు,చెన్నైల మధ్య రవాణాను వేగవంతం చేయడం, వాణిజ్యం, అనుసంధానతను పెంచడం జరుగుతుంది.
"ఎలిఫెంట్ అండర్ పాసింగ్ రోడ్ స్పెషల్" ఈ ప్రాజెక్ట్ ముఖ్యంగా బెంగళూరు నుండి చిత్తూరు, శ్రీపెరుంబుదూర్ వంటి ప్రధాన ప్రాంతాలను కలుపుతుంది, ఈ మార్గంలో గల అటవీ ప్రాంతంలో సుమారు 40 పైగా ఏనుగులు సంచరిస్తూ ఉన్నాయి వీటికి ప్రాణం నష్టం జరగకుండా ఎత్తైన పిల్లర్లను నిర్మించి రోడ్డు నిర్మాణం జరుగుతుంది. దక్షిణ భారతదేశంలో అతిపెద్ద హైవే ప్రాజెక్టులలో ఇది ఒకటి.
బెంగళూరు (హోస్కోట్) నుండి చెన్నై (శ్రీపెరంబుదూర్) వరకు నిర్మిస్తున్న గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే గతంలో దీనిని 2025 చివరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, భూసేకరణ మరియు ఇతర సాంకేతిక కారణాల వల్ల గడువు పొడిగించబడింది.తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పరిధిలోని కొన్ని సెక్షన్లలో ఇంకా పనులు కొనసాగుతున్నాయి.
2026 నాటికి పూర్తి అవుతుందని అంచనా వేస్తున్నారు.



66
3808 views