logo

సూర్యాపేటలో వివాహిత ఆత్మహత్య*

*సూర్యాపేటలో వివాహిత ఆత్మహత్య*

జర్నలిస్టు : మాకోటి మహేష్

*భర్త వేధింపులే కారణమని కుటుంబ సభ్యుల ఆరోపణ*

సూర్యాపేట పట్టణంలో కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. పట్టణంలోని డీమార్ట్ పక్క సందులో నివాసం ఉంటున్న వివాహిత ఇంట్లో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది.

మృతురాలి భర్త గత రెండు సంవత్సరాలుగా కెనడాలో నివాసం ఉంటున్నాడు. ఇటీవల సూర్యాపేటకు వచ్చిన భర్త తిరుపతికి వెళ్లిన సమయంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.

భర్త వేధింపుల కారణంగానే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న టౌన్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

0
88 views