
జిల్లా ఎస్పీ శ్రీ ఎస్ సతీష్ కుమార్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు..జిల్లా పోలీస్ కార్యాలయంలో '"ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS)" కార్యక్రమాన్ని
జిల్లా ఎస్పీ శ్రీ ఎస్ సతీష్ కుమార్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు..జిల్లా పోలీస్ కార్యాలయంలో '"ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS)" కార్యక్రమాన్ని నిర్వహించిన... జిల్లా అడిషనల్ ఎస్పి శ్రీమతి అంకిత సురాని ఐపీఎస్ గారు...
ఈరోజు( సోమవారం) జిల్లా పోలీస్ కార్యాలయంలో '"ప్రజా సమస్యల పరిష్కార వేదిక" కార్యక్రమాన్ని జిల్లా అడిషనల్ ఎస్పి శ్రీమతి అంకిత సురాని ఐపీఎస్ గారు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుండి అర్జీలను స్వీకరించి, అర్జీదారులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
వారి ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించారు. కుటుంబ కలహాలు, సైబర్ మోసాలు, తల్లిదండ్రులు వేధింపులు, భర్త/అత్తారింటి వేధింపులు,భూ-ఆస్థి వివాదాలు, ఆన్లైన్ మోసం, సిటీల పేరుతో మోసం,ఇతర సమస్యలపై ఫిర్యాదుదారులు స్వేచ్ఛగా విన్నవించుకోగా, వారి సమస్యలపై సంబంధిత పోలీసు అధికారులతో స్వయంగా ఫోన్లో మాట్లాడి ఫిర్యాదు అంశాలను పరిశీలించి, వాటి పూర్వాపరాలను విచారణ చేసి, ఫిర్యాదు అంశాలు వాస్తవాలైనట్లయితే ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 70,ఫిర్యాదులు అందాయి.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ గారితో పాటుగా , లీగల్ అడ్వైజర్ సాయినాథ్ రెడ్డి ఎస్బి సిఐ వెంకటేశ్వర్లు, డిటిఆర్బిసిఐ లక్ష్మీకాంత్ రెడ్డి మరియు సిబ్బంది పాల్గొన్నారు.
SP SATHISHKUMARIPS ap police