
కడప నగరంలో సంక్రాంతి సంబరాలు వేడుకల లో పాల్గొన్నారు మేయర్ పాక సురేష్
*సంక్రాంతి సంబరాలు*
*కడప నగరంలోని 21వ డివిజన్ రాజీవ్ మార్గ్ నందు సంక్రాంతి పండుగ సందర్భంగా BRK News ఆధ్వర్యం లో నిర్వహించిన ముగ్గుల పోటీల కార్యక్రమంలో కడప నగర మేయర్ పాక సురేష్ కుమార్ గారు మరియు కార్పొరేటర్లు డివిజన్ ఇంచార్జిలు బాలస్వామి రెడ్డి గారు, సుబ్బరాయుడు గారు , కడప నగర ప్రధాన కార్యదర్శి రెడ్డయ్య గారు జర్నలిస్ట్ సంఘం అధ్యక్షుడు శ్రీకాంత్ గారు పాల్గొన్నారు...*
*మేయర్ గారు మాట్లాడుతూ మన సాంప్రదాయాలు రానురాను కనుమరుగే పరిస్థితిలు ఉన్నాయి .గతంలో సంక్రాంతి పండుగ శోభయామానంగా జరిగేది రైతులకు సంబంధించి ధాన్యం పంపి తీసుకొచ్చి తొలి పండగ జరుపుకునే వారు..*
*గతంలో సంక్రాంతి పండుగ ఆహ్లాదకర వాతావరణంలో జరిగేది..*
*ఈ ముగ్గుల పోటీల కార్యక్రమం గత 5,6 సంవత్సరాల నుంచి ప్రతి డివిజన్లో కూడా పోటీలు జరుగుతున్నాయి..*
*BRK News రిపోర్టర్ కృష్ణ గారి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు పెద్ద ఎత్తున నిర్వహించడం చాలా సంతోషకరము . ప్రతి ఒక్కరు ఇలాంటి ముగ్గుల పోటీలలో తమ పిల్లలతో పాల్గొని మన సంప్రదాయాలను నేర్పించాలని తెలిపారు...*
*కడప ప్రజలందరికీ ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు మేయర్ గారు తెలిపారు...*