లేపాకుల నాగరత్న గౌడ్‌కు ఘన సన్మానం
లేపాకుల నాగరత్న గౌడ్‌కు ఘన సన్మానం
బీసీ చైతన్య వేదిక జిల్లా మహిళా అధ్యక్షురాలిగా ఎంపిక
నగరి నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ తెలుగు మహిళ ప్రధాన కార్యదర్శి లేపాకుల నాగరత్న గౌడ్ బీసీ చైతన్య వేదిక చిత్తూరు జిల్లా మహిళా అధ్యక్షురాలిగా ఎంపికైన సందర్భంగా సోమవారం ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమం టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పోతుగుంట విజయ్ బాబు నేతృత్వంలో జరిగింది. ఈ సందర్భంగా నాగరత్న గౌడ్‌ను పూలమాలలు వేసి, దుస్సాలువాతో ఘనంగా సత్కరించారు.
విజయ్ బాబు మాట్లాడుతూ, నాగరత్న గౌడ్ పార్టీకి మరియు సమాజానికి చేసిన సేవలను ప్రశంసిస్తూ, భవిష్యత్తులో ఆమె మరిన్ని ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు. మహిళల హక్కులు, బీసీ వర్గాల అభివృద్ధికి ఆమె చేస్తున్న కృషి అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఇ. రవినాయుడు, జి. ధనపాల్, సుమన్ నాయుడు, గాలి పాండురంగయ్య, మణికంఠ, జలకం నవీన్ తదితరులు పాల్గొని నాగరత్న గౌడ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.