logo

సంఘమిత్ర కేంద్రానికి స్టీల్ ప్లేట్లు అందజేసిన లయన్స్ క్లబ్.

నంద్యాల AIMA MEDIA): సోమవారం స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జాతీయ యువజన దినోత్సవం పురస్కరించుకుని నంద్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక సంఘమిత్ర బాలుర ఆవాస గృహానికి నంద్యాల లయన్స్ క్లబ్ వ్యవస్థాపక సభ్యులు ఆత్మకూరు సుదర్శనం శెట్టి సౌజన్యంతో 120 స్టీల్ ప్లేట్లు అందజేశారు.నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేసుల నాగరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆత్మకూరు సుదర్శనం శెట్టి,లయన్స్ క్లబ్ సీనియర్ సభ్యులు డాక్టర్ గెలివి సహదేవుడు, డాక్టర్ రవి కృష్ణ, ఎ.ఎన్.సి. ఆగ్రోస్ మేనేజింగ్ డైరెక్టర్ ఆత్మకూరు రవి ,మహేశ్వర్ రెడ్డి, కోశాధికారి అమిదేల జనార్ధన్ పాల్గొని 10 రూపాయల విలువ చేసే 120 స్టీల్ ప్లేట్లు సంఘమిత్ర ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్టీల్ బ్యాంక్ కు విరాళంగా అందజేశారు. ఆత్మకూరు సుదర్శనం శెట్టి మాట్లాడుతూ సంఘమిత్ర సేవా కార్యక్రమాలను కొనియాడారు. డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ ఆత్మకూరు సుదర్శనం శెట్టి మనవడి వివాహ సందర్భంగా విరాళంగా ఇచ్చిన లక్ష రూపాయల తో ఈ సంవత్సరం లయన్స్ క్లబ్ తరఫున పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. సంఘమిత్ర ఉపాధ్యక్షులు మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ సంఘమిత్ర ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా స్టీల్ బ్యాంక్ నిర్వహిస్తున్నామని, ఫంక్షన్లకు స్టీల్ ప్లేట్లు ,గ్లాసులు ఉచితంగా వాడుకోవడానికి ఇస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేసుల నాగరాజు,లయన్స్ క్లబ్ సీనియర్ సభ్యులు డాక్టర్ గెలివి సహదేవుడు, డాక్టర్ రవి కృష్ణ, కోశాధికారి అమిదేల జనార్ధన్, ఎ.ఎన్.సి. ఆగ్రోస్ మేనేజింగ్ డైరెక్టర్ ఆత్మకూరు రవి,సంఘమిత్ర ఉపాధ్యక్షులు మహేశ్వరరెడ్డి, వెంకటేశ్వర్లు కోశాధికారి సముద్రాల నాగరాజు, కార్యవర్గ సభ్యులు రమణయ్య గౌడ్ పాల్గొన్నారు.

1
433 views