logo

మధురవాడలో కలువలో చిక్కుకున్న గేదె అగ్నిమాపక సిబ్బంది శ్రమతో సురక్షిత రక్షణ

మధురవాడ మిథిలాపురి వుడా కాలనీలో ఓ గేదె అనుకోకుండా కలువలో పడిపోవడంతో కలకలం రేగింది. మధ్యాహ్నం సమయంలో జరిగిన ఈ ఘటన స్థానికుల దృష్టికి ఆలస్యంగా వచ్చింది. పరిస్థితి తీవ్రంగా ఉండటంతో రాత్రి సమయంలో అగ్నిమాపక శాఖను ఆశ్రయించారు.

సమాచారం అందుకున్న వెంటనే సూర్యబాగ్ ఫైర్ స్టేషన్‌కు చెందిన సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ప్రత్యేక పరికరాలు, అఫ్గట్స్ సహాయంతో గేదెను బయటకు తీసే ప్రయత్నం చేశారు.

దాదాపు రెండు గంటలకుపైగా శ్రమించిన అనంతరం గేదెను ఎలాంటి గాయాలు కాకుండా సురక్షితంగా బయటకు తీశారు. గేదె క్షేమంగా ఉండటంతో స్థానికులు ఊరట చెందారు. అగ్నిమాపక సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రమాదం పెద్దదిగా మారకుండా నివారించగలిగారు.

0
0 views