గాజులరామారం: రహదారి మూసివేతతో ఇబ్బందులు: మాజీ ఎమ్మెల్యే
గాజులరామారం: రహదారి మూసివేతతో ఇబ్బందులు: మాజీ ఎమ్మెల్యే
గాజులరామారంలోని కైసర్ నగర్ సమీపంలోని ఎలిప్ ఇండస్ట్రీస్ రహదారిని పోలీసులు మూసివేయడంపై మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ అసహనం వ్యక్తం చేశారు. ఆయన పరిస్థితిని పరిశీలించి, గత 20 ఏళ్లుగా ఉన్న ఈ దారి గుండా నిత్యం 3000 మంది కార్మికులు డ్యూటీలకు వెళ్తారన్నారు. కిడ్నాప్ నేపంతో దారిని మూసివేయడం సరికాదన్నారు. ఇంచార్జ్ మంత్రి, సీపీలతో మాట్లాడి సమస్యను త్వరగా పరిష్కరిస్తానని కార్మికులకు హామీ ఇచ్చారు.