
సంక్రాంతి ముగ్గుల పోటీలో విజేతలకు బహుమానం అందజేసిన 36 వ వార్డ్ టీడీపీ ఇంచార్జ్ మారుతి ప్రసాద్.
నంద్యాల (AIMA MEDIA): ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమైఖ్య మరియు నంద్యాల చిరంజీవి ఫ్యాన్స్ వారి ఆధ్వర్యంలో నంద్యాలలోని మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్ నందు సంక్రాతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించటమైనది ఈ పోటీలలో 110 మంది మహిళలు పాల్గొని రంగు రంగుల ముగ్గులను రేసారు.ఈ పోటీలలో మొదటి బహుమతి శుబాషిని,ద్వితియ బహుమతి మం. సిందు,తృతీయ బహుమతి వై.లక్ష్మి లక్ష్మి శిరిష,చతుర్త బహుమతి జి. శ్రీలక్ష్మి,పంచమ బహుమతి ఎన్.మల్లికతొ పాటు పాల్గొన్న ప్రతి మహిళకు చిరంజీవి సినిమా మన శంకర వరప్రసాద్ సినిమా టికెట్‌లను ప్రొత్సాహక బహుమతులుగ అందించడమైనది. ఈ కార్యక్రమంకు ముక్య అతిదులుగ ప్రతాప్ తియేటర్ ప్రొప్రైటర్ వి.ప్రతాప్ రెడ్డి,రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షులు గాలి శ్రీనివాస్ , 36 వార్డు టీడీపీ ఇంచార్జ్ మారుతి ప్రసాద్ పాల్గొని బహుమతులను అందజేసారు.ఈ కార్యక్రమంలొ రాష్ట్ర కార్యదర్శి నగరడోణ సుధీర్,రాష్ట్ర రాజకీయాల కన్వీనర్ యాదవల్లి విశ్వనాధ్,శాంతి,ప్రబాకర్ శర్మ,పసుపులేటి ప్రసాద్,శ్రీనివాసగౌడ్,నవీన్,నందాలాల్,సత్యనారాయణ,మల్లిక తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమం లో పల్గొన్న ప్రతి మహిళలకు ప్రత్యేక ధన్యవాదములు తెలియజేసారు.