
సంక్రాంతి 'కిక్కు' దింపిన సర్కార్: క్వార్టర్ మీద పది పెంపు!
ముందు మందు బాబులకు రాష్ట్రంలోని ఎన్డీయే ప్రభుత్వం దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఎన్నికల ముందు గత వైసీపీ ప్రభుత్వంలో ఉన్న మద్యాన్ని జే బ్రాండ్లని మద్యాన్ని అధిక ధరలకు విక్రయిస్తున్నారని, తాము అధికారంలోకి వస్తే కల్తీ మద్యాన్ని, నాసిరకం మద్యాన్ని, జే బ్రాండ్లను నిషేధించి మందుబాబులు మంచిగా కోరుకునే మంచి నాణ్యమైన మద్యాన్ని అందిస్తామని, మద్యం బాబుల ఆరోగ్యాన్ని చెడగొట్టకుండా వారి భార్యల పుస్తెలతాడు తెగకుండా మంచి మద్యాన్ని సరసమైన రేట్లకు ఇస్తామని చెప్పి మందుబాబులను నమ్మించి అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం నేడు మద్యం బాబులపై కొరడా ఝళిపిస్తుంది.
ఇప్పుడు సంక్రాంతి పండుగ వస్తున్న సందర్భంలో మద్యం ధరలను ప్రతి కంపెనీ క్వార్టర్ బాటిల్ పై పది రూపాయలు అదనంగా మద్యం షాపుల్లో వసూలు చేస్తుండడంతో మందుబాబులు ఆగ్రహ ఆవేశాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు ప్రభుత్వం క్వార్టర్ బాటిల్ పై పది రూపాయలు అదనంగా పెంచిందా లేదా రాష్ట్రంలో ఉన్న మద్యం సిండికేట్లు క్వార్టర్ బాటిల్ పై పది రూపాయలు పెంచారా అని మద్యం బాబులు ప్రశ్నిస్తున్నారు.
పెరుగుదలలో ప్రభుత్వానికి సంబంధం లేకపోతే అధిక ధరలకు విక్రయిస్తున్న మద్యం దుకాణాల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని లేదంటే ఒకవేళ ప్రభుత్వమే ఈ మద్యం పెరుగుదల నిర్ణయాలు తీసుకుంటే దానిని నిలుపుదల చేయాలని మందుబాబులు వేడుకుంటున్నారు. అకస్మాత్తుగా పెరిగిన మద్యం ధరలపై వివరణ కోరేందుకు స్థానిక బొబ్బిలి ఎక్సైజ్ గారు ఫోన్ కి ఫోన్ చేస్తే ఆయన ఫోను స్విచ్ ఆఫ్ లో ఉంది. ప్రభుత్వం అధికారులకు ఇచ్చిన ఫోను స్విచ్ ఆఫ్ చేసి ఉంటే ఎవరిని సంప్రదించాలని మద్యం బాబులు ప్రశ్నిస్తున్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అకస్మాత్తుగా క్వార్టర్ బాటిల్ పై ఉన్న ఎంఆర్పి కంటే అదనంగా పది రూపాయలు మద్యం షాపుల యాజమాన్యాలు వసూలు చేస్తున్నాయి. దీనిపై మద్యం బాబులు పెంచిన మద్యం ధరలను తగ్గించాలని లేదంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని, గత వైసీపీ ప్రభుత్వానికి ఇప్పుడు ఉన్న ఎన్డీయే ప్రభుత్వానికి మధ్య ఎలాంటి తేడా లేదని మద్యం బాబులు హెచ్చరిస్తున్నారు.