logo

ఆర్టీసీ ఏఎం కృష్ణారావు మాతృమూర్తి మృతి: నివాళులర్పించిన జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు


ఎస్. కోట నియోజకవర్గం, ఎల్. కోట మండలం, గేదలవానిపాలెం గ్రామంలో విషాదం నెలకొంది. విజయనగరం ఆర్టీసీ డిపో అసిస్టెంట్ మేనేజర్ చప్ప కృష్ణారావు మాతృమూర్తి చప్ప సన్యసమ్మ ఈరోజు కన్నుమూశారు.
విషయం తెలుసుకున్న విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్ఆర్సీపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) వెంటనే గేదలవానిపాలెం గ్రామానికి చేరుకున్నారు. కృష్ణారావు స్వగృహానికి వెళ్లి సన్యసమ్మ పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ధైర్యం చెప్పారు.
ఈ కార్యక్రమంలో వైయస్ఆర్సీపీ సీనియర్ నాయకులు గేదెల శాంత, నియోజకవర్గ సోషల్ మీడియా విభాగ అధ్యక్షుడు ఎడ్ల కిషోర్, స్థానిక సర్పంచ్ అర్జున్, సూరి నాయుడు, ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొని మృతురాలికి నివాళులర్పించారు.

0
1031 views