logo

సొంత ఊర్లలో పండుగ చేసుకోవడానికి నగరవాసులు ప్రయాణమయ్యారు...

🟥NEW SENSE
#Sankranthi
#Holidays
జర్నలిస్టు : మాకోటి మహేష్
సంక్రాంతి సెలవులు ప్రారంభమయ్యాయి.

సొంత ఊర్లలో పండుగ చేసుకోవడానికి నగరవాసులు ప్రయాణమయ్యారు...

ఆంధ్రాలో అతిపెద్ద పండుగ కావడంతో అటువైపు వెళ్ళే రహదారులన్నీ వాహనాలతో కిటకిటలాడుతున్నాయి...

ముఖ్యంగా విజయవాడ రహదారి వాహనాల రద్దీమాయంగా మారిపోయింది.. టోల్ ప్లాజా వద్ద నగరంలోని ప్రధాన రోడ్లలో కనిపించే ట్రాఫిక్ జామ్ దృశ్యాన్ని కళ్లకు కడుతోంది...

కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవుతున్నట్లు ప్రయాణంలో ఉన్న వాహనదారులు చెబుతున్నారు...

ప్రధానమైన పంతంగి టోల్ గేట్ దాటినప్పటికీ వేగంగా వెళ్ళలేనంత వాహనాల రద్దీ ఉందని చెబుతున్నారు...

ఈరోజు నుండి మంగళ వారం వరకు వాహనాల రద్దీ ఇలాగే ఉంటుంది కాబట్టి అర్జెంట్ పనులమీద విజయవాడ లేదా.. ఈ రోడ్డు మార్గంలో వెళ్లాలనుకునే వారు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు..

....

0
46 views