logo

బుచ్చింపేట జెడ్పీ హైస్కూల్‌కు ప్లేగ్రౌండ్ ఏర్పాటుకు తక్షణ చర్యలు. మంత్రివర్యులు నారా లోకేష్

అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం బుచ్చింపేట గ్రామానికి చెందిన వార్డు కార్యదర్శి అనిమిరెడ్డి రమణ, గ్రామస్థుడు సబ్బవరపు లక్ష్మీ నారాయణ (పోలిష్) వారు స్వచ్ఛందంగా సుమారు రూ. 2 లక్షల సొంత నిధులతో బుచ్చింపేట జెడ్పీ హైస్కూలులో కళా వేదిక నిర్మించారు. ఈ నిర్మాణం గురించిన వివరాలు, అలాగే పాఠశాలలో ఆట స్థలం లేక విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఇటీవల విశాఖపట్నం పర్యటనలో ఉన్న ఐటీ, విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ తెలియజేశారు.ఈ సందర్భంలో మంత్రివర్యులు నారా లోకేష్ గ్రామ ప్రజల ఉపకార భావనను అభినందిస్తూ, “కళావేదిక నిర్మాణం మంచి ఆదర్శమని, విద్యా అభివృద్ధికి సమాజం ఇలాంటి సహకారం అందించడం ప్రసంశనీయం” అన్నారు. అలాగే బుచ్చింపేట జెడ్పీ హైస్కూల్‌కి ప్లేగ్రౌండ్ ఏర్పాటుకు తక్షణ చర్యలు తీసుకునే విధంగా సంబంధిత అధికారులకు సూచనలు చేస్తానని సానుకూలంగా స్పందించారు.గ్రామస్తులు ఈ సందర్భంగా రమణ మరియు లక్ష్మీ నారాయణకు అభినందనలు తెలుపుతూ, తమ పిల్లలకు మంచి సౌకర్యాలు అందించేందుకు ప్రభుత్వం సహకరించనుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.

5
609 views