logo

ఉప రవాణా కమిషనర్ వీర్రాజు ఆధ్వర్యంలో, జిల్లాలో గల ప్రైవేట్ ట్రావెల్ బస్సుల యజమానులతో సమావేశం



* *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారము, ఈరోజు అనంతపురం ఉప రవాణా కమిషనర్ కార్యాలయంలో ఉప రవాణా కమిషనర్ వీర్రాజు ఆధ్వర్యంలో, జిల్లాలో గల ప్రైవేట్ ట్రావెల్ బస్సుల యజమానులతో సమావేశం నిర్వహించబడినది.*

* *ఈ సమావేశంలో సంక్రాంతి పండుగ సందర్భంగా వచ్చే అధిక డిమాండ్ నేపథ్యంలో అధిక ధరలు వసూలు చేయరాదని ఆదేశించారు.*
* *ఏపీఎస్ఆర్టీసీ నిర్దేశించిన ధరల కంటే 50 శాతం మాత్రమే గరిష్టంగా వసూలు చేసే విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగినది.*
* *ప్రైవేట్ యజమానులు నిర్దేశించిన ధరల వివరాలను అభి బస్, రెడ్ బస్ వంటి యాప్ ల ద్వారా రవాణా శాఖ నిరంతరము పర్యవేక్షిస్తుందని, అధిక ధరలు నిర్దేశించిన ప్రైవేట్ బస్సు యాజమాన్యాలపై తగిన చర్యలు తీసుకోబడతాయని ఉప రవాణా కమిషనర్ తెలియజేశారు.
కొత్తగా రిజిస్ట్రేషన్ కొరకు లేదా ట్రాన్సాక్షన్ చేసుకునే ట్రాన్స్పోర్ట్ వాహనాలకు వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ డివైస్లను అమర్చుకోవాలని తెలియజేయడం జరిగింది.
అధిక ధరలు వసూలు చేసే బస్సు యజమానులపై రవాణా శాఖ దాడులు నిర్వహించి కేసులు పెడతామని తెలియజేశారు.
ఈ సమావేశంలో ప్రాంతీయ రవాణా అధికారి సురేష్ నాయుడు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు మరియు బస్సు యజమానులు పాల్గొన్నారు*

5
568 views