కడప నగరంలో ఐటిఐ సర్కిల్ దగ్గర సాయిబాబా స్కూల్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు
తేదీ.09 01 26
స్థలము. కడప
తెలుగు వారి సంప్రదాయ పండుగ సంక్రాంతి పండుగ ప్రతి ఒక్కరూ సంతోషంగా సుఖః సంతోషాలతో జరుపుకోవాలని ఎమ్మెల్సీ, సాయిబాబా విద్యాసంస్థల అధినేత రామచంద్రారెడ్డి ఆకాంక్షించారు. పాఠశాల ఆవరణంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ముందస్తు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కడప నగరంలోని ఐటీఐ సర్కిల్ సమీపంలోని సాయిబాబా పాఠశాలలో ఈరోజు ఉదయం సంక్రాంతి పండుగ సందర్భంగా ముందస్తు వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల అధినేత రామచంద్రారెడ్డి,ప్రిన్సిపాల్ శ్రీదేవి, డైరెక్టర్ సుధీర్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించగా పాఠశాలలోని విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో మెరిశారు. భోగి మంటలు, రంగు రంగుల హరివిల్లు తో ముత్యాల ముగ్గులు వేసి అలరించారు. విద్యార్థులకు సిబ్బందికి ఎమ్మెల్సీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు