జిల్లెల్ల గ్రామంలో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎన్ఎండి ఫయాజ్.
గోస్పాడు (AIMA MEDIA ): నంద్యాల నియోజకవర్గ గోస్పాడు మండలం జిల్లెల్ల గ్రామంలో శుక్రవారం పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ ముఖ్య అతిథిగా హాజరై, గ్రామంలో నూతనంగా నిర్మించనున్న హోమియోపతి ఆసుపత్రి భవనానికి మరియు పాఠశాల భవనానికి భూమి పూజ నిర్వహించారు.ఈ సందర్భంగా ఎన్ఎండి ఫయాజ్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్యం మరియు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా ఈ భవనాల నిర్మాణాన్ని చేపట్టినట్లు తెలిపారు. నిర్ణీత సమయంలోగా నాణ్యతతో ఈ పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను, కాంట్రాక్టరును కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లెల్ల గ్రామ టీడీపీ నాయకులు సదాశివరెడ్డి, నారాయణరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, అస్ముద్దీన్, కాంట్రాక్టర్ రవిచంద్ర రెడ్డి, దీపక్ రెడ్డి, బుగ్గ రాముడు, మిద్దె హుస్సేన్ మరియు ఇతర కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.