logo

శాంతిరాం మెడికల్ విద్యార్థులకు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రీసర్చ్ స్కాలర్‌షిప్.

నంద్యాల (AIMA MEDIA): 2024వ సంవత్సరంకు సంబంధించి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ వారు నిర్వహించిన రీసర్చ్ స్కాలర్‌షిప్ కు శాంతిరాం మెడికల్ కాలేజ్ విద్యార్థులు ఎంపికయ్యారు.ఎంపికైన శాంతిరాం మెడికల్ కళాశాల విద్యార్థినులకు శాంతిరాం మెడికల్ కళాశాల చైర్మన్ శాంతిరాముడు చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అవార్డులను అందజేశారు.శాంతిరామ్ వైద్య కళాశాలలో ఎంబిబిఎస్ చదువుతున్న ఇద్దరు వైద్య విద్యార్థులకు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వారు నిర్వహించిన అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ రీసెర్చ్ స్కాలర్షిప్ 2024 పథకం కింద అవార్డు సర్టిఫికెట్స్ పొందిన షేక్ హర్షియా భాను, పాపిరెడ్డి మోక్షిత లకు కళాశాల చైర్మన్ డాక్టర్ మిద్దె శాంతిరాముడు, ప్రిన్సిపల్ వసంత్ ఆర్ చావన్ సర్టిఫికెట్లు అందజేశారు.

2
9 views