logo

కొత్తకోట హైస్కూల్‌లో ఎమ్మెల్యే సహకారంతో డ్రైనేజీ, వాకింగ్ పనుల ప్రారంభం


అనకాపల్లి జిల్లా రావికమతం మండలం కొత్తకోట గ్రామంలో చోడవరం శాసనసభ్యులు కె.ఎస్.ఎన్.రాజు గారి సహకారంతో ఎమ్మెల్సీ నిధులతో కొత్తకోట హైస్కూల్‌లో డ్రైనేజీ వ్యవస్థ, వాకింగ్ పాత్ నిర్మాణ పనులకు శుభారంభం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ, సామాజిక నాయకులు పాల్గొన్నారు. ఈ పనులు స్థానిక విద్యార్థులకు, గ్రామవాసులకు మంచి సౌకర్యాలను అందిస్తాయని నాయకులు తెలిపారు. ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.రాజు మాట్లాడుతూ, ప్రభుత్వ నిధులతో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో చోడవరం జనసేన పార్టీ ఇంచార్జి పీవీఎస్.రాజు, నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు కోట నేలవేణి, బీజేపీ మండల అధ్యక్షులు, కోపరేటివ్ అధ్యక్షులు గూటాల చిన్న, మండల ప్రధాన కార్యదర్శి దంట్ల సత్యనారాయణ, నీటి సంఘం నాయకులు అందరూ పాల్గొని ఈ అభివృద్ధి పనులు పూర్తయితే స్కూల్ పరిసరాలు మరింత మెరుగ్గా మారతాయని స్థానికులు స్వాగతించారు. గ్రామంలో అభివృద్ధికి ఎమ్మెల్యే గారి కృషి ప్రశంసనీయమని నాయకులు అభిప్రాయపడ్డారు.

0
35 views