logo

వంట మాస్టర్ కుటుంబానికి 'సిరమ్మ' సంక్రాంతి కానుక: 55 ఇంచీల ఎల్ఈడీ టీవీ బహుకరణ!


ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్పర్సన్, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు మరియు భీమిలి నియోజకవర్గం సమన్వయ కర్త మజ్జి శ్రీనివాస రావు(చిన్న శ్రీను) కుమార్తె *చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరమ్మ* తమ వద్ద పని చేస్తున్న సిబ్బంది పట్ల మరోసారి తన ఆప్యాయతను చాటుకున్నారు. తమ వద్ద చాలా కాలంగా వంట మాస్టర్ గా పని చేస్తున్న అనిల్ రే కి సంక్రాంతి పండగ కానుకగా 55 ఇంచీలు ఎల్ఇడి టీవీ ను బహూకరించారు. శుక్రవారం వసంత విహార్ లో గల అనిల్ రే ఇంటికి వెళ్ళి వారి కుటుంబ సభ్యులకు సిరమ్మ తన చేతుల మీదుగా బహుమానం అందచేసి, వారి పట్ల తనకున్న ఆప్యాయతను చాటుకున్నారు. అంతే కాకుండా గతంలో ప్రిజ్ ను కానుకగా ఇచ్చారు. అదేవిదంగా వంట మాస్టర్ పిల్లలు ఇద్దరినీ కూడా కార్పోరేట్ స్కూల్ ఐన సన్ స్కూల్ లో చేర్పించి సిరమ్మే వారిని చదివిస్తున్నారు.
ఈ సందర్భంగా వంట మాస్టర్ కుటుంబ సభ్యులు సిరమ్మకు తమ కృతజ్ఞతలు తెలియచేశారు.
ఈ కార్యక్రమంలో చిన్న శ్రీను సోల్జర్స్ ఉపాధ్యక్షులు తోట వాసు, చిన్న శ్రీను సోల్జర్స్ సభ్యులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

11
1013 views