logo

పాణ్యం మండలంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు స్థలం కేటాయింపు.

పాణ్యం (AIMA MEDIA): పాణ్యం మండలంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు 4.67ల స్థలాన్ని పాణ్యం SRBC స్థలం లో కేటాయించిన నియామక పత్రాన్ని ప్రిన్సిపాల్ శోభరానికి పాణ్యం తహసీల్దార్ నరేంద్రనాథ్ రెడ్డి అందజేశారు.తొందరలో స్థల నికి కొలతలు హద్దులు వేస్తామని అన్నారు.ఈసందర్బంగా ప్రిన్సిపాల్ శోభరాణి మాట్లాడుతూ 'పాణ్యం మండలం లో గత ప్రభుత్వంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పడిందే గాని విద్యార్థులకి స్థలం కూడా ఏర్పాటు చేయలేదని మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా విద్యార్థి ప్రజా సంఘాలు ఎన్నోసార్లు ధర్నాలు చేసిన ఫలితంగా ఈరోజు ఎస్ఆర్బిసి స్థలం లో 4.67సెంట్ల స్థలాన్ని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఇవ్వడం వలన చాలా సంతోషంగా ఉన్నది తెలిపారు.ప్రిన్సిపాల్ మాట్లాడుతూ డిగ్రీ కళాశాలకు సొంతంగా భవనం, స్థలం లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడ్డారన్నారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోనే తరగతులు నిర్వహిస్తూ వచ్చామన్నారు. ఎస్సార్బీ సీ కాలనీలో కళాశాలకు స్థలాన్ని కేటాయించడంపై కలెక్టర్ రాజకుమారి కీ, తహసీల్దారు నరేంద్రనాథెడ్డికి, ప్రజా సంఘాల నాయకులకు జలవనరుల శాఖ అధికారులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

0
0 views