logo

ఏపీజేయూ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శిగా కొమ్మోజు రమేష్ ఏకగ్రీవ ఎన్నిక

విజయవాడ గాంధీనగర్‌లోని ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల యూనియన్ (ఏపీజేయూ) రాష్ట్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సంఘ రాష్ట్ర అధ్యక్షులు కాకుమాను వెంకట వేణు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఏపీజేయూ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శిగా కొమ్మోజు రమేష్‌ను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు.
సంఘ అభివృద్ధి, జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, రాష్ట్రవ్యాప్తంగా యూనియన్ బలోపేతానికి కొమ్మోజు రమేష్ చేస్తున్న సేవలను గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించినట్లు నాయకులు తెలిపారు. జర్నలిస్టుల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ, సంఘ కార్యకలాపాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్న కొమ్మోజు రమేష్‌కు ఈ పదవి మరింత బాధ్యతను పెంచుతుందని అన్నారు.
ఈ సందర్భంగా నియామక పత్రాలను రాష్ట్ర అధ్యక్షులు వెంకట వేణు అందజేశారు. అనంతరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాదంశెట్టి శేఖర్ బాబు, సహాయ కార్యదర్శి బొడ్డు కృష్ణభగవాన్, సభ్యులు సానే గిరిబాబు, నంద్యాల జిల్లా గౌరవ అధ్యక్షులు వారు నరసింహా మూర్తి, జిల్లా కార్యదర్శి శివశంకర్, ప్రకాశం జిల్లా సభ్యులు రావూరి వసంతరాయల్ తదితరులు కొమ్మోజు రమేష్‌ను శాలువాలతో సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందించారు.
నూతన బాధ్యతలపై స్పందించిన కొమ్మోజు రమేష్ మాట్లాడుతూ, జర్నలిస్టుల సంక్షేమం, వృత్తి భద్రత, సమస్యల పరిష్కారానికి సంఘ నాయకత్వంతో కలిసి నిరంతరం పనిచేస్తానని హామీ ఇచ్చారు. ఏపీజేయూను రాష్ట్రవ్యాప్తంగా మరింత బలోపేతం చేయడమే తన లక్ష్యమని పేర్కొన్నారు.

3
368 views