logo

దుండిగల్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ స్వరూప గారు. తెలుగు భాషలో ఛార్జ్ షీట్: పోలీసు శాఖలో సరికొత్త అధ్యాయం! 👮‍♀️✨

జర్నలిస్ట్: మాకోటి మహేష్

✍️ తెలుగు భాషలో ఛార్జ్ షీట్: పోలీసు శాఖలో సరికొత్త అధ్యాయం! 👮‍♀️✨
సాధారణంగా పోలీస్ దర్యాప్తు, కోర్టు పత్రాలు అంటే అంతా ఇంగ్లీష్‌మయం.. కానీ ఆ విధానానికి స్వస్తి పలికి, సామాన్యులకు అర్థమయ్యేలా మన మాతృభాష తెలుగులో అభియోగపత్రం (Charge Sheet) దాఖలు చేసి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు దుండిగల్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ స్వరూప గారు. 👏
🔹 విశేషాలు ఇవే:
మాతృభాషపై మక్కువ: ఇంగ్లీష్ రాని సామాన్యులకు కూడా కేసు వివరాలు అర్థం కావాలనే ఉద్దేశంతో 2025లో రెండు కేసుల దర్యాప్తు నివేదికలను పూర్తిగా తెలుగులోనే కోర్టుకు సమర్పించారు. 📝
సత్వర న్యాయం: ఒక మిస్సింగ్ కేసును వేగంగా ఛేదించి, తల్లి బిడ్డలను క్షేమంగా కుటుంబ సభ్యులకు అప్పగించి తన కర్తవ్యాన్ని చాటుకున్నారు. 👩‍శ్రీ‍👧
ఉన్నతాధికారుల ప్రోత్సాహం: ఏసీపీ శంకర్ రెడ్డి గారి సహకారంతో, మేడ్చల్ కోర్టులో ఈ తెలుగు అభియోగపత్రాలను దాఖలు చేయడం విశేషం.
🏆 దక్కిన గౌరవం:
తెలంగాణ రాష్ట్ర అధికార భాషలో దర్యాప్తు పూర్తి చేసినందుకు గాను, ఇటీవల బంజారాహిల్స్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర డీజీపీ బి. శివధర్ రెడ్డి గారు మరియు శిఖా గోయల్ ఐపీఎస్ గారి చేతుల మీదుగా ఆమె ప్రశంసలు అందుకున్నారు. 🎖️

0
77 views