logo

కడప మేయర్ - మార్నింగ్ విజిట్*

*కడప మేయర్ - మార్నింగ్ విజిట్*

*కడప నగర మేయర్ మార్నింగ్ విజిట్ లో భాగంగా 26 వ డివిజన్ ఇంచార్జి త్యాగరాజు గారి ఆధ్వర్యంలో మాసాపేట లోని శ్రీ సీతారాముల ఆలయ నిర్మాణ పనులను మరియు హిందూ శ్మశాన వాటిక ప్రాంతాలను కడప నగర మేయర్ పాక సురేష్ కుమార్ గారు మరియు డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి గారు రాష్ట్ర SC సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ పులి సునీల్ కుమార్ గారు పర్యటించారు...*

*స్థానిక కార్పొరేటర్ మరియు సీతారాముల ఆలయ చైర్మన్ అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుల విజ్ఞప్తి మేరకు దాతల సహకారంతో మరియు కార్పొరేషన్ నిధులతో ఆలయ నిర్మాణ పనులు పూర్తి చేస్తామని మేయర్ గారు తెలిపారు...*

*కో ఆప్షన్ మెంబర్ లు పత్తి రాజేశ్వరి గారు & జహీర్ గారు , హిందూ సమ్మేళన కార్యదర్శి శివ కేశవ గార్లతో 13 డివిజన్ల కు సంబంధించిన మాసాపేట , గౌస్ నగర్ హిందూ శ్మశాన వాటికలు & పాతకడప నందు గల తర్పణ స్థలం ను మేయర్ గారు పరిశీలించారు...*

*మాసాపేటలోని హిందూ శ్మశాన వాటిక నందు 26 డివిజన్ ఇంచార్జ్ త్యాగరాజు గారి మామగారు కీర్తిశేషులు మాజీ కార్పొరేటర్ బక్కా అయ్యన్న గారి సమాధి వద్ద మేయర్ గారు డిప్యూటీ మేయర్ గారు & రాష్ట్ర నాయకులు స్థానిక నాయకులు నివాళులర్పించారు...*

*సంక్రాంతి పండుగ సందర్భంగా స్మశాన వాటిక లలో సమాధులు ఎవరైతే నిర్మించుకున్నారో వాళ్లందరికీ కూడా పెద్దల కార్యక్రమం రోజున నైవేద్యం పెట్టి ఆశీర్వాదం తీసుకునే* *కార్యక్రమం కలదు కావున*
*#మేయర్ గారు స్మశాన* *వాటికలను పరిశీలించి వెంటనే స్మశానం లోపల చెట్లను పిచ్చి మొక్కలను తొలగించి ప్రజలకు ఇబ్బందులు పడకుండా కార్యక్రమాలు చేసుకునే విధంగా క్లీన్ చేయాలని MHO రమేష్ గారు మరియు ఇంజనీరింగ్ విభాగ అధికారులు DE బాల మల్లేశ్వర్ గారు &AE ప్రశాంత్ రెడ్డి గార్లని ఆదేశించారు...*

*అలాగే స్మశాన వాటిక లలో వాటర్ ట్యాంక్ మరియు ప్రహరీ గోడల నిర్మాణ లకు ఎస్టిమేషన్ వేయాలని అధికారులను మేయర్ గారు ఆదేశించారు...*

*26 డివిజన్ నాయకుడు వైఎస్ఆర్సీపీ నగర ప్రధాన కార్యదర్శి సంపత్ గారు రాజ్యాంగ నిర్మాత డా. బి ఆర్ అంబేడ్కర్ గారి చిత్రపటాన్ని బహుకరించి అనంతరం డివైడర్ సమస్య లపై వినతి పత్రం మేయర్ గారికి అందజేశారు..*

*ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి డివిజన్ ఇంచార్జ్ లు సుబ్బరాయుడు , రామకృష్ణ సుబ్బరాయుడు , నాగమణి గార్లు , వైఎస్ఆర్ సీపీ నాయకులు రెడ్డయ్య, వాసు SC సెల్ నగర అధ్యక్షుడు కంచుపాటి బాబు ,SC సెల్ & డివిజన్ల నాయకులు గంగాధర్ , రవి , సాయి , అజయ్ , వరహాలు , శేష మణి శానిటేషన్ అధికారులు బాబు,నరేష్ అమెంటీస్ సెక్రటరీ లు పెంచలయ్య , పఠాన్ బాబు తదితరులు పాల్గొన్నారు...*

6
896 views