విద్యుత్ సమస్య ఉంటే 1912 కు ఫిర్యాదు చేయండి
జనవరి కామారెడ్డి జిల్లా బాన్సువాడ రిపోర్టర్ షేక్ అమైర్
ఎఈ.సంతోష్ కుమార్.
కామారెడ్డి జిల్లా బాన్సువాడ బతుకమ్మ : గృహ అవసరాలు, వ్యవసాయానికి సంబంధించిన విద్యుత్ సమస్య ఉంటే 1912 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని పట్టణ సెక్షన్ అసిస్టెంట్ ఇంజనీర్ జి .సంతోష్ కుమార్ కోరారు.
ఈ సందర్భంగా ఎఈ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రతి మంగళవారం, గురువారం, మరియు శనివారములలో ప్రజాబాట నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ ప్రజా బాటలో లోకల్ ప్రజాప్రతినిధులను ఆహ్వానిస్తున్నామని తెలిపారు.ఈ ప్రజా బాటలో వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తామని తెలిపారు.