logo

ఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో 10వ తరగతి ఉర్దూ మీడియం విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ

జనవరి కామారెడ్డి జిల్లా బాన్సువాడ రిపోర్టర్ షేక్ అమైర్

కామారెడ్డి జిల్లా బాన్సువాడ లో రాష్ట్రంలో ముస్లింల విద్యాప్రమాణాలు పెంచేందుకు ఎంఐఎం కృషి చేస్తోందని ఎంఐఎం జిల్లా జనరల్ సెక్రటరీ, బాన్సువాడ టౌన్ అధ్యక్షుడు సాయీద్ ఖాన్ అన్నారు. సోమవారం పట్టణంలోని మైనార్టీ ఫంక్షన్ హాల్లో ఏర్పాటుచేసిన ‘సాలారే మిల్లత్ ఆల్ ఇన్ వన్ 2026' గైడ్స్ను పట్టణంలోని ప్రభుత్వ స్కూల్లో ఉర్దూ మీడియంలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు అందజేశారు.ఆనంతరం ఆయన విద్యార్థులందరూ కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు. మాజీ ఎంపీ సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ భవిష్యత్ తరాలకు ఉన్నత విద్యను అందించాలనే సంకల్పంతో 25 ఏండ్లుగా ఆల్ ఇన్ వన్ గైడ్లను పార్టీ తరఫున విద్యార్థులకు అందజేస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమాల్లో ఎంఐఎం కామారెడ్డి జిల్లా జాయింట్ సెక్రటరీ మొహమ్మద్ లాయక్,నాయకులు అంజాద్, హశం,అహ్మద్ హుస్సేన్, అకిఫ్ హుస్సేన్,ఫాజిల్ తదితరులు పాల్గొన్నారు.

1
714 views