logo

ప్రభుత్వ పథకాలకు ప్రతి రైతుకు విశిష్ట సంఖ్య తప్పనిసరి: ఏఓ పవన్ కుమార్.

బండి ఆత్మకూరు (AIMA MEDIA): బండి ఆత్మకూరు మండలం స్థానిక ఎఓ కార్యాలయం నందు మండల వ్యవసాయ అధికారి పవన్ కుమార్ ఆధ్వర్యంలో రైతు సేవ కేంద్రం సిబ్బందికి సమీక్ష నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారి మాట్లాడుతూ మండలంలో 8150 మంది రైతులకు విశిష్ట సంఖ్య జారీ అయినది,ఇంకా 2820 మంది రైతులు వెంటనే విశిష్ట సంఖ్య పొందాలని, అన్నదాతలకు వ్యవసాయ సేవలను సులభతరం చేసి మరింత పారదర్శకంగా అందించేందుకు ప్రతి రైతుకూ ప్రత్యేక విశిష్ట గుర్తింపు సంఖ్య తప్పనిసరి అని, రైతు సంక్షేమశాఖ, భారతప్రభుత్వం సమన్వయంతో రాష్ట్ర వ్యవసాయశాఖ ద్వారా 11 అంకెలతో రైతు గుర్తింపు సంఖ్య ద్వారా ప్రభుత్వ సేవలను అందిస్తుందని తెలిపారు. రైతు భూవివరాలను రైతు రిజిస్ట్రీ పోర్టల్‌లో నమోదు చేసిన తర్వాత గుర్తింపు సంఖ్య కేటాయించి, ఈ సంఖ్య ఆధారంగానే వ్యవసాయ సంబంధిత వివిధ రాయితీలు, బీమా వంటి ప్రయోజనాలు, పీఎం కిసాన్‌, అన్నదాత సుఖీభవ,పంటలబీమా, పంటరుణాలపై వడ్డీరాయితీ, రాయితీపై యంత్రపరికరాలు, సూక్ష్మ పోషకాలు, పెట్టుబడి సాయం, పంట రుణాలు రైతులు పొందుతారని ఏఓ తెలిపారు. ఈ -పంట నమోదు, నీటి పారుదల, తెగుళ్ళ నియంత్రణ, వాతావరణ సూచనలు వంటి సేవలు పొందవచ్చు అని వారు తెలిపారు. వీఆర్వోల లాగిన్ లో వెరిఫికేషన్ కి వచ్చిన రికార్డులను త్వరగా ఆమోదించాలని సిబ్బందిని సూచించారు. ఈ కార్యక్రమంలో వారితోపాటు వ్యవసాయ విస్తరణ సిబ్బంది లక్ష్మయ్య సునందన తదితర సిబ్బంది పాల్గొన్నారు.

5
699 views