logo

కొవ్వూరులో మన ఊరు స్వచ్ఛ సంక్రాంతి

అనకాపల్లి జిల్లా, రోలుగుంట మండలం కొవ్వూరు గ్రామంలో స్వచ్ఛ సంక్రాంతి కార్యక్రమం గొప్ప ఉత్సాహంతో జరిగింది. గ్రామ సర్పంచ్ కాంతమ్మ ఆధ్వర్యంలో ఎంపీడీవో నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా, ఎంపీపీ వై శ్రీనివాసరావు పర్యవేక్షణలో నిర్వహించారు. పారిశుద్ధ్య కార్మికులకు సన్మానాలు అందించి, సంక్రాంతి పండుగ సమయంలో ఊరు శుభ్రతను ప్రోత్సహించారు . ఎంపీడీవో నాగేశ్వరరావు మాట్లాడుతూ... "స్వచ్ఛ సంక్రాంతి మన గ్రామ అభివృద్ధికి మొదటి దశ. ప్రతి ఇల్లు, ప్రతి రోడ్డు శుభ్రంగా ఉండాలి. స్వచ్ఛ్ భారత్ మిషన్ లక్ష్యాలు ఇక్కడ నుంచి సాకారం కావాలి" అని, మండలంలోని కొవ్వూరు పంచాయతీ సెక్రెటరీ విజయకుమార్ కు ఉత్తమ సెక్రెటరీగా అవార్డు వచ్చిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు .సర్పంచ్ కాంతమ్మ మాట్లాడుతూ... "మన ఊరు స్వచ్ఛంగా, సంక్రాంతి సమయంలో పరిసరాలు కలుషితం కాకుండా చూసుకోవాలి. మా గ్రామస్తుల సహకారంతో ఆదర్శ గ్రామంగా మారుతాం" అని తెలిపారు.ఎంపీపీ వై శ్రీనివాసరావు మాట్లాడుతూ... "పర్యవేక్షణలో ఈ కార్యక్రమం స్ఫూర్తిదాయకం. భోగి మంటలకు ముందు శుభ్రత అవసరం. మనం కలిసి పనిచేస్తే గ్రామం మారుతుంది" అన్నారు.ఐటీడీపీ ప్రెసిడెంట్ బంటు రాజు మాట్లాడుతూ... "వికసిత్ భారత్‌లో స్వచ్ఛత ముఖ్యం. సంక్రాంతి పండుగలో పర్యావరణ రక్షణకు మా గ్రామం ముందంజలో ఉండాలి. అందరూ చేరుకుని పాల్గొనాలి" అని ప్రోత్సహించారు .సన్మానాలు కార్యక్రమం సందర్భంగా గ్రామంలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు గౌరవం పూర్వకంగా సన్మానాలు అందజేశారు. వారి కృషి ప్రతి సంక్రాంతి సమయంలో గుర్తించాలని నాయకులు నిర్ణయించారు. ఈ కార్యక్రమం గ్రామంలో స్వచ్ఛతా భావనను మరింత పెంచింది . కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ విజయకుమార్, సచివాలయం సిబ్బంది, గ్రామ పెద్దలు, యువకులు ప్రజలు పాల్గొన్నారు

5
373 views