logo

"చర్చి తాళాలు తీయకపోతే ఆందోళన ఉధృతం చేస్తాం": కలెక్టరేట్ వేదికగా క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్ హెచ్చరిక


విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలంలోని చింతపల్లి బర్రిపేటలో గ్రామంలో గల చర్చ్ తాళాలు తీసి, తెరిపించకపోతే ఆందోళన ఉదృతం చేస్తామని క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి ఆర్ ఎస్ జాన్ హెచ్చరించారు . సోమవారం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్ లో కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చర్చ్ లో కొందరు వేరే ఆరాధన కోసం లేని రచ్చ చేస్తున్నారని దీనిపై పాస్టర్ బర్రీ అప్పన్న అలియాస్ జార్మియా అతని భార్యను అని అక్రమ అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం అన్యాయం అన్నారు. ఒక దేవుని ఆలయంలోకి వెళ్ళి తాళం వేయమని ఏ నిబంధనలో ఉందో తెలియజేయాలన్నారు. కూటమికి చెడ్డ పేరు తెచ్చేందుకు కొందరు అధికారులు ఇలా వ్యవహరిస్తున్నారా అని నిలదీశారు. సి ఆర్ పి సి 145 ప్రకారం వర్షిప్ సెంటర్ కి తాళం వేయకూడదనే చట్టంలో ఉందని అన్నారు. దీని మీద ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి ఇందుకు బాధ్యులైన ఎమ్మార్వో పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే చర్చ్ ను తెరిపించాలని, లేనియెడల క్రైస్తవుల ఆందోళనను ఉదృతం చేస్తామనిహెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.

10
702 views