logo

మలబార్ గ్రూప్ చారిటీ సంస్థ ఆధ్వర్యంలో కడపలో ఉచిత మైక్రో లెర్నింగ్ సెంటర్లు ప్రారంభం

మలబార్ గ్రూప్ చారిటీ సంస్థ ఆధ్వర్యంలో కడపలో ఉచిత మైక్రో లెర్నింగ్ సెంటర్లు ప్రారంభం

కడవ.మన జన ప్రగతి.
కడప నగరంలోని ప్రఖ్యాతి కాంచిన బంగారు నగల దుకాణం వారి మలబార్ గ్రూప్ చారిటీ సంస్థ ఆధ్వర్యంలో గ్రామీణ, నిరుపేద ప్రాంతాల పిల్లల విద్యాభివృద్ధి లక్ష్యంగా ఫ్రీ ట్రైనింగ్ సెంటర్ల పేరిట ఉచిత మైక్రో లెర్నింగ్ సెంటర్లు (ఎమ్మెల్సీ లు) ఏర్పాటు చేస్తున్నామని, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థ ప్రతినిధులు కోరారు.
ఈ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా ఇప్పటికే 1400కి పైగా మైక్రో లెర్నింగ్ సెంటర్లు విజయవంతంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 25 మైక్రో లెర్నింగ్ సెంటర్లు కొనసాగుతుండగా, అందులో భాగంగా కడప జిల్లాలో 4 మైక్రో లెర్నింగ్ సెంటర్లను శనివారం ప్రారంభించారు.
కడపలోని బాలాజీ నగర్, తారక రామ నగర్, ఏ.ఎస్.ఆర్ నగర్, సాయిబాబా నగర్ ప్రాంతాలలో నివసిస్తున్న నిరుపేదల కోసం ఈ ఉచిత ట్యూషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థ నుంచి లెసన్ సత్యన్ (స్టోర్ హెడ్),ఇషాక్ బాషా (మార్కెటింగ్ మేనేజర్) మలబార్ గ్రూప్ చారిటీ సంస్థ ఆర్థిక సహకారంతో తనల్ సంస్థ నుంచి
శ్రీ బొల్లాపల్లి మనోహర్ బాబు (జోనల్ హెడ్) పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇషాక్ బాషా, మనోహర్ బాబు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలకు నాణ్యమైన విద్యతో పాటు వారి నైపుణ్యాలను పెంపొందించేలా ప్రత్యేక శిక్షణ అందించాలనే ఉద్దేశంతో ఈ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఇక్కడ పిల్లలకు చదువుతో పాటు ప్రతిరోజూ పౌష్టిక ఆహారం, పాలు, గుడ్లు, ప్రత్యామ్నాయ రోజులలో చిక్కీ అందిస్తున్నామని తెలిపారు. త్వరలో మరిన్ని ప్రాంతాలలో మైక్రో లెర్నింగ్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ కేంద్రాలకు పంపించి ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరైన
లయన్ పి. మన్‌సూర్ అలీ ఖాన్ కడప నగర టిడిపి అధ్యక్షులు మాట్లాడుతూ
ఏ పిల్లవాడు చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో మలబార్ సంస్థ చేపట్టిన ఈ కార్యక్రమం అభినందనీయం. ప్రాథమిక విద్యతో పాటు జీవన నైపుణ్యాలపై కూడా పిల్లలకు అవగాహన కల్పించాలి తెలిపారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 48వ డివిజన్ ఇంచార్జ్ శివారెడ్డి, ప్రశాంత్ కుమార్ (లాయర్), ప్రవీణ్, నాగేశ్వరి, అఖిల, ఆదిలక్ష్మి, నాగ లక్ష్మి (అంగన్వాడీ టీచర్),పిల్లలు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

54
1213 views