logo

"పేకాట రాయుళ్లపై పోలీసుల 'డ్రోన్' సర్జికల్ స్ట్రైక్: తుప్పల్లో దాక్కున్నా వదలని నిఘా.. 10 మంది అరెస్ట్!"


విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు భోగాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ జి.రామకృష్ణ గారి ఆధ్వర్యంలో డ్రోన్ కెమెరాల్ని ఉపయోగించి డైట్ కాలనీ దాటిన తర్వాత రెసిడెన్షియల్ స్కూల్ మధ్యలో లోపల తుప్పల్లో పేకాట ఆడుతున్న వారిని డ్రోన్ కెమెరా ద్వారా గుర్తించి నెల్లిమర్ల ఎస్సై గణేష్ గారు వారి సిబ్బంది చాకచక్యంగా వారిపై రైడ్ చేయడం జరిగింది. ఈ రైడ్ లో డబ్బులు పణంగా పెట్టి కోతాట ఆడుతున్న పదిమంది వ్యక్తుల్ని పట్టుకొని వారి వద్ద నుంచి రూ.1,80,500 నగదు, మరియు 8 సెల్ ఫోన్లను సీజ్ చేసి వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. డ్రోన్ కెమెరాలు క్రైమ్ నిర్మూలనలో ఎంతో ఉపయోగపడతాయని అలాగే బహిరంగంగా ఎవరైనా పేకాటాడిన మరియు ఇతర అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా నెల్లిమర్ల ఎస్సై గారు హెచ్చరించారు.

38
1369 views