logo

చౌక దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్.

నంద్యాల (AIMA MEDIA): నంద్యాల మునిసిపాలిటీ పరిధిలోని బొమ్మల సత్రం వార్డు నెంబరు–32 లో గల చౌక దుకాణం నెం. 1384121 ను జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్ శనివారం ఉదయం తనిఖీ చేశారు.ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, నంద్యాల మునిసిపాలిటీ పరిధిలోని రేషన్ కార్డు దారులకు కిలో గోధుమ పిండిని రూ.20/-కే అందిస్తున్నట్లు తెలిపారు. శనివారం రోజున బొమ్మల సత్రం వార్డు నెంబరు–32 లోని చౌక దుకాణం నెం.1384121 వద్ద జాయింట్ కలెక్టర్ చేతుల మీదుగా రేషన్ కార్డు దారులకు గోధుమ పిండిని పంపిణీ చేశారు..అలాగే నంద్యాల అర్బన్ ఏరియాలోని అన్ని చౌక ధరల దుకాణాలలో గోధుమ పిండిని అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. రేషన్ కార్డు దారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చౌక దుకాణంలో నిత్యావసర వస్తువుల పంపిణీ విధానాన్ని జాయింట్ కలెక్టర్ పరిశీలించారు.ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీ జ్యోతి రవి బాబు, నంద్యాల CSDT MVSS శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

1
74 views